Begin typing your search above and press return to search.
సర్కారుకు భారీగా జీఎస్టీ ఆదాయం.. కేసీఆర్ కు షాక్.. జగన్ కు ఊరట
By: Tupaki Desk | 2 Dec 2020 12:00 PM ISTకేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధనంగా మారింది జీఎస్టీ వసూళ్లు. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో సింహభాగం దీని ద్వారానే వస్తుందన్నది తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆశించినంతగా జీఎస్టీ ఆదాయం రావట్లేదు. లాక్ అనంతరం.. మార్పు నెమ్మదిగా చోటు చేసుకుంటోంది. ఇప్పుడిప్పుడు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతున్న పరిస్థితి. మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడిన నేపథ్యంలో.. జీఎస్టీ ఆదాయం పుంజుకుంటోంది. గడిచిన మూడు నెలలుగా వరుసగా జీఎస్టీ స్థూల వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. 2019 నవంబరుతో పోలిస్తే.. 2020 నవంబరు ఆదాయం ఎక్కువగా ఉండటం గమనార్హం.
అంతేకాదు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం రూ.లక్ష కోట్లను క్రాస్ చేయటం ఇది రెండోసారి. 2019 నవంబరులో జీఎస్టీ ఆదాయం రూ.1.03లక్షల కోట్లు కాగా.. తాజాగా రూ.1.04లక్షల కోట్లకు చేరుకుంది. కాకుంటే అక్టోబరు నెలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంది. పండుగ సీజన్ కావటంతో అక్టోబరులో పన్ను ఆదాయం భారీగా పెరిగిందని చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత కేంద్రానికి వస్తున్న పన్ను ఆదాయం ఊరట కలిగించేలా ఉంది.
ఇక.. రాష్ట్రాల విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వసూళ్లు ఆసక్తికరంగా మారాయి. 2019 నవంబరుతో పోలిస్తే 2020 నవంబరులో వచ్చిన పన్ను వసూళ్లు ఏపీకి ఎక్కువగా ఉంటే తెలంగాణకు తక్కువగా ఉండటం గమనార్హం. 2019 నవంబరులో ఏపీకి రూ.2230 కోట్ల వసూళ్లు వస్తే.. తాజాగా అంతకు 12 శాతం పెరిగి రూ.2507 కోట్లకు చేరుకోవటం జగన్ ప్రభుత్వానికి ఊరటనిస్తుందని చెప్పాలి.
అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పన్ను వసూళ్లు తగ్గటం గమనార్హం. లాక్ డౌన్ తర్వాత నుంచి తెలంగాణ వసూళ్లు గణణీయంగా తగ్గిపోతున్నాయి. 2019 నవంబరులో 3349 కోట్ల జీఎస్టీ వసూళ్లు కాగా.. ఈ నవంబరులో మాత్రం 5.9 శాతం తగ్గి కేవలం రూ.3175 కోట్లకు మాత్రమే పరిమితం కావటం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రథమార్థంలో జీఎస్టీ వసూళ్లు రూ.32671 కోట్లు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తే.. కరోనా పుణ్యమా అని అది కేవలం రూ.8224 కోట్లకు మాత్రమే పరిమితమైన దుస్థితి. తాజా గణాంకాలు తెలంగాణ ప్రభుత్వానికి నీరసాన్ని తీసుకొచ్చాయని చెప్పక తప్పదు.