Begin typing your search above and press return to search.

కరోనాతో కన్నుమూసిన బిషప్‌, డెడ్ బాడీలకి జనం ముద్దులు !

By:  Tupaki Desk   |   4 Nov 2020 5:00 PM IST
కరోనాతో కన్నుమూసిన బిషప్‌, డెడ్ బాడీలకి జనం ముద్దులు !
X
అసలే అది చిన్న దేశం. ఇప్పటికే అక్కడ ఆరులక్షల మందికి కరోనా సోకింది.. అంటే మూడో వంతు ప్రజలు కరోనా బారిన పడ్డారు.. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశంలో బిషప్‌ అమ్ఫిలోహిజే రాడోవిక్‌ కరోనా వైరస్‌ సోకి చనిపోయారు.ఆయన భౌతికకాయాన్ని సందర్శించడానికి ప్రజలు చాలా మందే వచ్చారు. వచ్చిన వారు దూరం నుంచి చూసి వెళితే అయిపోయేది.. కానీ బిషప్‌ గౌరవార్థం ఆయన చేతిపై, నుదిటిపై మాస్కులు లేకుండా ముద్దులు వర్షం కురిపించారు.

ఈ విషయం గురించి బిషప్‌కు చికిత్సనందించిన డాక్టర్‌ మాట్లాడుతూ, ముందు ఆయన పార్థీవదేహాన్ని అలా తెరచి పెట్టకుండా నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆయన శరీరంపై కరోనా వైరస్‌ ఒక పొరలా ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఈ చిన్న దేశంలో మూడు వంతుల మంది దాదాపు ఆరు లక్షలకు పైగా కరోనా బారిన పడ్డారు. మరణించిన ఆయన శరీరంపై కరోనా వైరస్‌ ఉంటుందని తెలిసి, డాక్టర్ల హెచ్చరికలను పక్కనపెట్టి అలా ముద్దులు పెట్టేవారిని ఏమనాలి? ఒక్కరు కూడా కోవిడ్‌ నిబంధనలను పాటించలేదు.. మరణించిన బిషప్‌ రాడోవిక్‌ కూడా అంతే బిషపే కానీ రాజకీయాలు కూడా నెరుపుతుంటారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ఉన్న మిలో జుకానోవిక్‌ను పదవి నుంచి దింపడానికి నానా ప్రయత్నాలు చేశారు..

ఇక బిషప్‌ అమ్ఫిలో హిజే రాడోవిక్ విషయానికి వస్తే ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ సోషలిస్ట్‌ నేత మిలో జుకానోవిక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గట్టిగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో జరిగే ఎన్నకల ప్రచారంలో డీపీఎస్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. బిషప్ అమ్ఫిలోహిజే, పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకి, మోంటెనిగ్రో నుంచి సెర్బియా విడిపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల ఆయన మాస్క్‌ లేకుండా తిరిగారు. సామాజిక దూరం పాటించకుండా చాలా మందిని కలిశారు. దీంతో ఆయన కరోనా బారిన పడి శుక్రవారం నాడు మరణించారు. ఇప్పుడు ఆయనకు కడసారి వీడోల్కు పలకడానికి వచ్చిన వారు కూడా కరోనా నియమాలు పాటించకుండా మాస్క్‌లు లేకుండా ఆయన మృతదేహాన్ని తాకుతూ ముద్దులు పెట్టడం చర్చనీయ అంశంగా మారింది.