Begin typing your search above and press return to search.
DMART లో ఘరానామోసం !
By: Tupaki Desk | 18 May 2020 3:20 PM ISTదేశంలో అనేక నగరాలలో ఉండే సూపర్ మార్కెట్లలో డి మార్ట్ కూడా ఒకటి. ఇతర సూపర్ మార్కెట్లతో పోలిస్తే డి మార్ట్ చాలా బెస్ట్ అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. దానికి కారణం ఇతర సూపర్ మార్కెట్లకన్నా డీమర్ట్ లో ఎంఆర్పి రేటు తక్కువ ఉండడమే.హైదరాబాద్ తో సహా అనేక నగరాలలో డి మార్ట్ లోకి కస్టమర్లు వెళ్లి ప్రతి నెల నెలకి సరిపడే వంట సామానులు నుండి అనేక వస్తువులు కొనుగోలు చేస్తూ తెచ్చుకుంటున్నారు. సూపర్ మార్కెట్లలో నమ్మకమైన సూపర్ మార్కెట్ గా డి మార్ట్ దూసుకుపోతోంది.మరి, ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారో లేదంటే ఇంకా ఎమ్మాన ఆశిస్తున్నారో తెలీదు కానీ. డి మార్ట్ లో తాజాగా ఓ ఘరానామోసం బయటపడింది.
అసలు విషయానికి వస్తే ... మౌలాలి హౌసింగ్ బోర్డ్ కు చెందిన డి నారాయణ అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం 3:30 గంటలకి డిమార్ట్ కి వెళ్ళాడు. సరుకులు కొనుగోలు చేసి బిల్లు కూడా చెల్లించాడు. అయితే, ఆ తర్వాత అనుమానం వచ్చి ఆయన సరుకులు మళ్ళీ తూకం వేయగా (రవ్వ, పంచదార, మినపప్పు, జీలకర్ర) వాటి తూకాల్లో సగానికి సగం తేడా రావడంతో అవాక్కయ్యాడు.దానిపై డిమాండ్ సిబ్బంది నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో , బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనితో పోలీసులు ఆ బిల్లుతో పాటు తక్కువ తూకం వచ్చిన నాలుగు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడ్చల్ జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులకి అప్పగించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు నిత్యం వేలాదిగా వచ్చే వినియోగదారులు నమ్మకాన్ని వమ్ము చేసేలా ఈ ఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. అయితే డి మార్ట్ , అలాగే ఇతర సూపర్ మార్కెట్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి ఏమి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.