Begin typing your search above and press return to search.

భాగ్యన‌గ‌రంలో 40 అంత‌స్థుల మేడ‌లు.. మార‌నున్న ముఖ‌చిత్రం!

By:  Tupaki Desk   |   31 March 2021 8:00 AM IST
భాగ్యన‌గ‌రంలో 40 అంత‌స్థుల మేడ‌లు.. మార‌నున్న ముఖ‌చిత్రం!
X
భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్ రూపురేఖ‌లు మారిపోనున్నాయా? అత్యంత వేగంగా అభివృద్ది దిశ‌గా హైద‌రాబా ద్ దూసుకుపోతుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రానున్న కొన్నేళ్ల‌లోనే హైద‌రాబాద్‌లో ఆకాశ హ‌ర్మ్యాలు వెల‌నున్నాయి. 40 అంత‌స్థుల మేడ‌లు ఊపిరిపోసుకోనున్నాయి. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు క‌లిసి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. రానున్న నాలుగైదేళ్ల‌లోనే హైద‌రాబాద్‌లో భారీ అంత‌స్థులు వెల‌వ‌నున్నాయి. వీటిలో చాలా ప్రాజెక్టులు ఐటీ కారిడార్‌తో అనుసంధానం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో కొంద‌రు బిల్డ‌ర్లు... త‌మ నిర్మాణాల‌కు `టాలెస్ట్ బిల్డింగ్ ఇన్‌ది సిటీ` అనే పేరు పెట్టాల‌ని అప్పుడే డిసైడ్ కావ‌డం గ‌మ‌నార్హం. కాగా, కొన్ని ప్రాజెక్టుల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని..కొంద‌రికి అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స్థానిక అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల కింద‌ట .. బెంగ‌ళూరుకు చెందిన సుమ‌ధుర గ్రూప్ 44 అంత‌స్థుల రెసిడెన్షియ‌ల్ వెంచ‌ర్ నిర్మాణానికి అనుమతులు పొందింది. సుమ‌ధుర ఒలింప‌స్ పేరుతో సైబ‌రాబాద్‌లో నిర్మించ‌నున్న ఈ ఆకాశ హ‌ర్మ్యం.. 2025 నాటికి పూర్త‌వుతుంద‌ని అంచ‌నా.

ఈ నిర్మాణం పూర్త‌యితే.. ప్ర‌స్తుతం నార్సింగిలో ఉన్న రాజ‌పుష్ప ప్రాప‌ర్టీకి చెందిన జీ+39 `ప్రొవెన్షియా` భ‌వ‌న రికార్డును తుడిచేయ‌నుంది. ప్ర‌స్తుతం ప్రొవెన్షియా ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గా.. సంబంధిత వ‌ర్గాలు మాత్రం.. ఇప్ప‌టికే టాప్ ఫ్లోర్స్ మొత్తం అమ్మ‌కం పూర్త‌య్యాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. స్క్వేర్ ఫీట్ 6459 రూపాయ‌లు ఉన్న‌ట్టు తెలిపారు. కాగా, 30వ అంత‌స్థుకు పైన ఉన్న ఫ్లోర్ల‌ను ఎక్కువ మంది ఇష్ట‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. దీనికి కార‌ణం.. ఎక్కువ స్పేస్ క‌లిసి వ‌స్తుండ‌డ‌మేన‌ని తెలిపారు.

ఇక‌, బెంగ‌ళూరుకే చెందిన కండ్యూర్ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ కూడా మియాపూర్‌లో 40 అంత‌స్థుల `కండ్యూర్ 40` పేరిట నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తోంది. ప్ర‌స్తుతం బ‌య్య‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. బెంగ‌ళూరులో మాత్రం ఈ సంస్థ 24 అంత‌స్థుల నిర్మాణాల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. కండ్యూర్ ప్రాజెక్టు 2024 నాటికి పూర్త‌య్యేలా ప్లాన్ చేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఈ సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధులు మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల అభిరుచులు మారాయ‌ని.. ఆకాశ హ‌ర్మ్యాల్లో ఎక్కువ స్పేస్ ఉన్న ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ని తెలిపారు.

ఇక‌, `ఎస్ ఏ ఎస్‌` ఇన్‌ఫ్రా కూడా హైద‌రాబాద్‌లో నిర్మాణాల‌పై దృష్టి పెట్టింది. 57 అంత‌స్థుల అతి భారీ ఎత్త‌యిన భ‌వ‌నాన్ని న‌గ‌రంలోనే నిర్మించేందుకు ఎస్ ఏ ఎస్ ప్రణాళిక‌లు సిద్దం చేస్తోంది.ఈ నిర్మాణం క‌నుక రూపు దాలిస్తే.. ద‌క్షిణ భార‌త దేశంలోనే ఇంత ఎత్త‌యిన నిర్మాణం ఇదే అవుతుంది. ఇక‌, ప్ర‌స్తుతం ఈ సంస్థ నాన‌క్‌రామ్ గూడ‌లో `ఐట‌వ‌ర్‌` పేరిట 36 అంత‌స్థుల నిర్మాణం ప్రారంభించింది. ఇక‌, హైద‌రాబాద్ వంటి కీల‌క‌న‌గ‌రాల్లో 40 అంత‌స్థుల ఆకాశ హ‌ర్మ్యాల నిర్మాణం.. పెరుగుతుండ‌డం.. ధ‌ర‌లు కూడా అందుబాటులో అంటే.. చ‌ద‌ర‌పు అడుగు 6500-7000 ఉండ‌డం.. వంటివి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను.. అదేస‌మ‌యంలో నిర్మాణ దారుల‌ను కూడా ఆక‌ర్షిస్తుండ‌డం గ‌మ‌నార్హం.