Begin typing your search above and press return to search.
విశాఖకు ఏమైంది? రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం తీవ్రత ఎంతంటే?
By: Tupaki Desk | 14 July 2020 9:15 AM ISTఏపీలోని ఉక్కునగరం విశాఖ టైం అస్సలు బాగున్నట్లు లేదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో వరుస పెట్టి మరీ విశాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. విశాఖ వాసుల గుండెల్లో భయాందోళనలు కలిగించేలా పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం అర్థరాత్రి వేళ విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం అందరిని భయపెట్టింది. సంస్థ ప్రాంగణంలోని రసాయనాల డ్రమ్ములకు మంటలు అంటుకోవటంతో అవి పెద్ద శబ్ధం చేస్తూ పేలిపోయాయి. ఈ శబ్ధాలు.. ఎగిసి పడుతున్న మంటలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ శబ్ధాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నాయంటే.. పది కిలోమీటర్ల దూరం వరకూ వినిపించటం గమనార్హం. ఇక.. మంటలు ఎంత భారీగా ఎగిసిపడ్డాయంటే.. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. దీంతో.. ఈ సంస్థకు చుట్టుపక్కల ఉన్న వారికేం చేయాలో తోచని పరిస్థితి. ఈ మంటల తీవ్రతకు ఫార్మాసిటీకి సమీపంలోని హెచ్ టీ విద్యుత్ లైన్లు సైతం తెగి పడ్డాయి.
విశాఖ సాల్వెంట్స్ సంస్థకు సమీపంలోని పలు సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు ప్రమాద తీవ్రతను చూసి తమ సంస్థల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు ఇళ్లు ఖాళీ చేసి.. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు బిక్కుబిక్కుమంటూ పరుగులు తీశారు. ఓవైపు భారీ శబ్దాలు.. మరోవైపు పెద్ద ఎత్తున కనిపిస్తున్న మంటలతో పాటు.. నల్లగా కమ్మేస్తున్న మంటలతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లక్కీగా ఈ భారీ ప్రమదంలో ఒకరు గాయపడటం మినహా మరెలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ ఫార్మాసిటీలో మొత్తం85 సంస్థలు ఒకేచోట ఉన్నాయి. మంటల తీవ్రత మరింత ఎక్కువై ఉంటే.. పక్క సంస్థలకు విస్తరించే అవకాశం ఉండేది. అయితే.. అలాంటిదేమీ చోటుచేసుకోకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే.. ఒక్కసారి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మంటలు వ్యాపించటం మొదలు పెడితే.. వాటిని నిలువరించటం కష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఫార్మాసిటీ పరిసరాల్లోని తానం.. పరవాడ.. తాడి.. లంకెలపాలెం.. ఈబోనంగి.. గొర్లువాని పాలెం తదితర గ్రామాలకు చెందిన వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇంతకూ ఈ భారీ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావటం లేదు.
ప్రాథమిక సమాచారం ప్రకారం పరిశ్రమ ఆవరణలోని ఐదు రియాక్టర్లు ఉన్నాయని.. అందులో ఒక దాని నుంచి పేలుడు సంభవించిందని.. అదే ప్రమాదానికి కారణమంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు తీవ్ర గాయాలకు గురైనట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన సంస్థ రసాయనాల్ని శుద్ధి చేసి పలు ఫార్మా కంపెనీలకు అమ్ముతుంటుంది. సుమారు పదిహేను రకాల రసాయనాలు ఇక్కడ నిల్వ ఉంచుతారు. అదే ప్రమాద తీవ్రతకు కారణంగా చెబుతున్నారు.