Begin typing your search above and press return to search.

దేశంలోనే టాప్ ఏపీ.. భారీగా ఉపాధి హామీ కూలి డబ్బులు

By:  Tupaki Desk   |   18 Oct 2020 11:20 AM IST
దేశంలోనే టాప్ ఏపీ.. భారీగా ఉపాధి హామీ కూలి డబ్బులు
X
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న వేళ.. అమల్లోకి తెచ్చిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆసక్తికర అంశం తాజాగా బయటకు వచ్చింది. పేదవారికి పనులు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పనులకు వెళ్లిన వారికి కూలీ ఇవ్వటం తెలిసిందే. దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా ఏపీలో అత్యధికంగా ఉపాధి హామీ వేతనాన్ని ఇస్తున్న వైనాన్ని గుర్తించారు. దేశంలో అత్యధికంగా ఉపాధి హామీ వేతాన్ని ఇచ్చే పది రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో నిలవటం గమనార్హం.

ఈ పథకంలో భాగంగా రోజుకు కనిష్ఠంగా రూ.164.. గరిష్ఠంగా రూ.200 లోపు మాత్రమే వేతనాన్ని చెల్లిస్తుంటారు. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం ఏకంగా రూ.229.72 చొప్పున ఇస్తున్నారు. అంటే.. గరిష్ఠంగా ఇచ్చే మొత్తాని కంటే రోజుకు రూ.30 చొప్పున ఇస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.దీని కారణంగా ఏటా ఏపీలోని ఈ పథకాన్ని వినియోగించే వారికి రూ.630 కోట్లు అదనపు లబ్ధి చేకూరుతుంది.

పొరుగున ఉన్న తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం కేవలం రూ.165.55 మాత్రమే. ఆ పక్కనే ఉండే తమిళనాడులో ఇచ్చే వేతనం రూ.188.81. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం భారీగా ఇస్తున్న ఉపాధి హామీ వేతనంతో పేద ప్రజలకు మేలు జరుగుతోంది. కరోనా వేళలో పలు వ్యాపారాలు దెబ్బ తిని ఉపాధికి ఇబ్బందిగా మారటంతో చాలా కుటుంబాలు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. దీని ద్వారా.. ఆయా కుటుంబాల వారు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు వీలు కలిగించినట్లుగా చెప్పక తప్పదు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే కేసీఆర్.. తమకంటే ఏపీలో ఎక్కువగా ఉపాధి హామీ వేతనాన్ని ఇవ్వటాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి.