Begin typing your search above and press return to search.

ధనిక, పేదల మధ్య ఆస్తుల్లో భారీ తేడా .. 10% మంది చేతుల్లోనే

By:  Tupaki Desk   |   18 Sept 2021 5:00 AM IST
ధనిక, పేదల మధ్య ఆస్తుల్లో భారీ తేడా .. 10% మంది చేతుల్లోనే
X
దేశంలో 50శాతంపైగా ఆస్తులు 10శాతం మంది ధనికుల చేతుల్లోనే ఉన్నాయి. కింది స్థాయిలోని 50శాతం మంది ప్రజల ఆధీనంలో మాత్రం 10శాతం కంటే తక్కువ ఆస్తులే ఉన్నాయంటూ కీలక సర్వే లో వెల్లడైంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 55.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 50.8 శాతం చొప్పున ఆస్తులు అత్యంత ధనికులైన 10శాతం మంది వద్దనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ శాంపిల్‌ సర్వే చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రూ.272.6 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉంటే,వాటిలో రూ.139.6 లక్షల కోట్ల ఆస్తులు 10శాతం మంది ధనికుల చేతుల్లోనే ఉన్నట్టు అధ్యయనం లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 10 శాతం పట్టణ వాసుల్లో సగటున ఒక్కో కుటుంబం వద్ద 1.5 కోట్ల మేర ఆస్తులు ఉండగా.. దిగువనున్న పేదల వద్ద రూ.2,000 (ఒక్కో కుటుంబం) మించి లేదు. జాతీయ గణాంక కార్యాలయం నిర్వహించిన ‘ఆల్‌ ఇండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ సర్వే 2019’లో ఈ వివరాలు తెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి పట్టణాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. అగ్రస్థాయి 10 శాతం కుటుంబాల వద్ద సగటున రూ.81.17 లక్షల ఆస్తులు ఉంటే.. పేద కుటుంబాల సగటు ఆస్తి రూ.41,000గా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రూ.272.6 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉంటే, వాటిలో రూ.139.6 లక్షల కోట్ల ఆస్తులు 10శాతం మంది ధనికుల చేతుల్లోనే ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ.238.1 లక్షల కోట్ల విలువగల ఆస్తులు ఉండగా... వాటిలో రూ.132.5 లక్షల కోట్ల ఆస్తులు 10శాతం మంది ఆధీనంలో ఉన్నాయి. కింది స్థాయి 50శాతం ప్రజానీకానికి గ్రామీణ ప్రాంతాల్లో 10.2శాతం, పట్టణ ప్రాంతాల్లో అయితే 6.2శాతం ఆస్తులు మాత్రమే ఉన్నట్టు సర్వే వెల్లడించింది. తెలంగాణలో కూడా ఆస్తుల విషయంలో ధనిక, పేదల వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అయితే 58.7 శాతం ఆస్తులు 10శాతం మంది ధనికుల వద్దే ఉన్నాయి.

కింది నుంచి 50 శాతం మంది ప్రజల ఆధీనంలో 4.1 శాతం ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం కొంత తక్కువగా ఉంది. అక్కడ 38.5 శాతం ఆస్తులు 10 శాతం ధనికుల వద్ద ఉంటే... కింది స్థాయి 50 శాతం మంది చేతుల్లో 14.6 శాతం ఆస్తులున్నట్టు సర్వే పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో 80.8 శాతం ఆస్తులు 10శాతం ధనికుల వద్దే ఉన్నాయి. కింది స్థాయిలోని 50శాతం ప్రజానీకం చేతుల్లో కేవలం 2.1శాతం ఆస్తులు మాత్రమే ఉన్నాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆస్తులు ఉండటం దీనికి కారణమని ఎన్‌ఎ్‌సఎస్‌ అధ్యయనం పేర్కొంది. తర్వాత పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణాల్లో ఆస్తుల విషయంలో ధనిక, పేదల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో జమ్మూకశ్మీర్‌ మెరుగ్గా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 10 శాతం అత్యంత ధనిక కుటుంబాల సగటు ఆస్తుల విలువ రూ.1.5 కోట్లు ఉంది. 10 శాతం అత్యంత పేద కుటుంబాల సగటు ఆస్తుల విలువ రూ.2 వేలు ఉంది. 2019 జనవరి - డిసెంబరు మధ్యకాలంలో ఈ సర్వే నిర్వహించారు.