Begin typing your search above and press return to search.
కరోనా కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లకు భారీగా డిమాండ్.. ఎందుకంటే..?
By: Tupaki Desk | 26 Dec 2021 5:00 AM ISTకరోనా వైరస్ భారతదేశంలో అడుగు పెట్టిన నాటి నుంచి చాలా మంది ప్రజలు ఉమ్మడిగా ప్రయాణాలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా బైక్ లను, కార్లను వినియోగిస్తున్నారు. అయితే ప్రజలు వారి వారి స్తోమత మేరకు అందుబాటులో ఉన్న వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్లు, బైక్ ల మార్కెట్ మరింత పెరిగింది.
మరో వైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకునేందుకు కూడా ప్రజలు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు సిద్ధపడుతున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఏ విధంగా అయితే పెరుగుతుందో.. సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు కూడా అదేవిధంగా పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో కొత్త కార్లను కొనేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు భిన్నంగా పాత కార్లను కొనే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో కుటుంబం మొత్తం కలసి ప్రయాణం చేయాలి అంటే కార్ అనేది బెస్ట్ ఆప్షన్ గా అన్ని వర్గాల ప్రజలకు కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తం వెచ్చించి కొత్త కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపే వారి సంఖ్య తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అందుబాటు ధరలో ఉండే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఎక్కువమంది ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేందుకు కారణాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పలు మార్పుల కారణంగా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగినట్టు చెప్పుకొచ్చారు. కేవలం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా పట్టణాలు గ్రామాల్లో కూడా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తక్కువ ఖర్చుతో పాత కార్లు దొరుకున్న కారణంగా ఎక్కువ మంది వీటికే మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు. పాత కార్లలో కూడా వాటికి సంబంధించిన ఫీచర్లు ఉండడంతో కొనుగోళ్లు పెరిగినట్లు చెప్పారు.
ఈ ఏడాదిలో 40 లక్షల యూనిట్ల మేర కొనుగోళ్లు జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగి 60 లక్షల యూనిట్లను దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.