Begin typing your search above and press return to search.
కరోనా కాలంలో కండోమ్స్ కు తెగ డిమాండ్?
By: Tupaki Desk | 5 May 2021 2:04 PM ISTకరోనా లాక్ డౌన్ అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. తొలి లాక్ డౌన్ లో ముట్టుకుంటే అంటుకునే ఈ అంటు వ్యాధి భయానికి చాలా మంది ముద్దు ముచ్చట్లకు దూరమయ్యారు. అయితే సంవత్సరకాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా మందికి కరోనా వచ్చి పోయింది. ఇక టీకాలను పెద్ద ఎత్తున వేసుకున్నారు.
సెక్స్ వల్ల కరోనా వ్యాపిస్తుందన్న భయానికి తొలి లాక్ డౌన్ లో చాలా మంది దూరంగా ఉండగా.. ఇప్పుడా భయం అందరిలో పోయింది. అందుకే ఇన్నాళ్లుగా సెక్స్ కు దూరంగా ఉన్న పురుషులు, మహిళలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ లైంగికంగా కలుసుకుంటున్నారు. అమెరికా, చైనా, బ్రిటన్, భారత్ సహా అన్ని దేశాల్లో యువతకు వ్యాక్సిన్లు వేస్తున్నారు.
అలా పొందిన వారు ఇక కరోనా తమకు రాదు.. ఏం చేయలేదన్న భరోసాతో చాలా మంది సెక్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నాళ్లనీ ఎదురుచూడలేమని.. ఏడాది దాటిందని.. ఇక ఎదురుచూపులు కరెక్ట్ కాదని.. చాలా మంది లైంగికంగా కలుసుకుంటున్నారు.
అయితే కరోనా కాలంలో లైంగికంగా కలిస్తే ఎంజాయ్ చేస్తే గర్భం దాల్చడం ఖాయం. అందుకే కరోనా కాలంలో ఆస్పత్రుల్లో డెలివరీలు చాలా కష్టం కావడంతో చాలా మంది సుఖాన్ని కోరుకుంటున్నా పిల్లలు, గర్భం వద్దని అనుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పిల్లలను కనడానికి వెనుకాడుతున్నారు.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కండోమ్ ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అమెరికా, చైనా , యూరప్ దేశాల్లో కండోమ్స్ వాడకం మళ్లీ పెరిగింది. ఎక్కువగా 18 నుంచి 24 ఏళ్ల వయసు వారు కండోమ్స్ కొంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కరోనా వల్ల ఏడాదిగా నష్టాల్లో కూరుకుపోయిన కండోమ్ కంపెనీలు ఇప్పుడు తాము మళ్లీ కోలుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నాయి.
మ్యాచ్ డాట్ కామ్ వెబ్ సైట్ ప్రకారం.. ఒక్క అమెరికాలోనే కరోనా కారణంగా గత ఏడాది 71శాతం మంది ఒంటరిగా ఉన్న స్త్రీ పురుషులు యువత సెక్స్ కు దూరం అయ్యారు. ఇప్పుడు వ్యాక్సిన్లు వేసుకోవడంతో మళ్లీ సెక్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ కరోనా టైంలో పిల్లలు కలుగకుండా ముందస్తుగా కండోమ్ లు కొంటూ తెగ వాడేస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కండోమ్ ల కొనుగోళ్లు పెరిగాయని తెలుస్తోంది.