Begin typing your search above and press return to search.

ఏసీబీ వలలో భారీ అవినీతి చేప

By:  Tupaki Desk   |   3 Oct 2019 10:57 AM GMT
ఏసీబీ వలలో భారీ అవినీతి చేప
X
ఏసీబీ వలలో ఓ పేద్ద అవినీతి చేప చిక్కింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆర్టీవో అధికారి బాగోతం బయటపడింది. ఏకంగా రూ.10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టిన అధికారి వ్యవహారం ఏపీలో చర్చనీయాంశమవుతుంది.

పక్కా సమాచారంతో బరిలోకి దిగిన ఏసీబీ అధికారులు కర్నూలు జిల్లా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్ ను పట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ - బెంగళూరు - కర్నూలు - తాడిపత్రి తదితర ప్రాంతాల్లో శివ ప్రసాద్ ఇల్లుతోపాటు అతని బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు.

శివప్రసాద్ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన బినామీగా గాజుల రామరావు పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఈ మేరకు ఆయన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.