Begin typing your search above and press return to search.

కొడుకు పెళ్లి కోసం టీఆర్ ఎస్ నేత సాహసం

By:  Tupaki Desk   |   1 March 2020 10:16 AM IST
కొడుకు పెళ్లి కోసం టీఆర్ ఎస్ నేత సాహసం
X
బాహుబలి సినిమా చూశాం. అందులో భారీ సెట్టింగ్ లు చూసి అబ్బురపడ్డాం. ఔరా అనుకున్నాం. అలాంటి ఇంద్రభవనాల లాంటి సెట్టింగ్ మళ్లీ కనిపించింది. ఏకంగా వంద ఎకరాల స్థలంలో భారీగా సెట్టింగ్ - షామియానాలు ఏర్పాటు చేవారు. వాటర్ ఫౌంటెయిన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. భారీ స్వాగతం ద్వారం. ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందా అని దగ్గరికి వెళ్లే చూసే సరికి.. పెళ్లి.. అవును టీఆర్ ఎస్ బడా నేత కుమారుడి పెళ్లి రిసెప్షన్ కోసం చేసిన హంగామా ఇదంతా..

ఖమ్మం మాజీ ఎంపీ - టీఆర్ ఎస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి పెళ్లి వేడుక అదిరిపోయింది. బాహుబలి సెట్టింగ్ లు తలపించేలా అంగరంగ వైభవంగా సెట్, ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్ ఇందుకు వేదికైంది. ఆదివారం జరిగే విందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు - ప్రజాప్రతినిధులు హాజరుకారున్నారు.

ఈనెల 26న పొంగులేటి కుమారుడి వివాహం సౌదీలోని అబుదాబీలో జరిగింది. ఆదివారం ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్ లో భారీ విందు ఏర్పాటు చేశారు. లక్షమందికి విందు ఇచ్చేలా ప్రాంగణాలను 8 విభాగాలుగా ఏర్పాటు చేశారు. కూలర్లు - మినరల్ వాటర్లు అబ్బో భారీ ఏర్పాట్లే ఉన్నాయి. విందు భోజనమే ఏర్పాటు చేశారు. రానూ పోనూ వేరే దారులు.. కొడుకు పెళ్లి కోసం పొంగులేటి కోట్లు ఖర్చు పెట్టినట్టు చూస్తేనే అర్థమవుతోంది.