Begin typing your search above and press return to search.

సీఎంను క‌ల‌వ‌లేక‌పోయిన ప్ర‌ముఖ న‌టుడు

By:  Tupaki Desk   |   31 May 2018 5:35 AM GMT
సీఎంను క‌ల‌వ‌లేక‌పోయిన ప్ర‌ముఖ న‌టుడు
X
ప్ర‌ముఖులు త‌మ‌ను క‌ల‌వ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే వారికి స‌మ‌యాన్ని ఇవ్వ‌టం మామూలే. దీనికి భిన్న‌మైన తీరును తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ద‌ర్శించి వార్త‌ల్లోకి వ‌స్తుంటారు. అయినా.. త‌న తీరు మార్చుకోవ‌టానికి ఆయ‌న ఇష్ట‌ప‌డ‌రు. ఆ మ‌ధ్య‌లో ప్ర‌భుత్వ విధానాల‌పై త‌మ అభ్యంత‌రాల్ని చెప్పేందుకు వామ‌ప‌క్ష నేత‌ల‌తో స‌హా ప‌లువురు విప‌క్ష నేత‌లు కేసీఆర్ ఆఫీస్‌కు వెళ్ల‌టం.. గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేయ‌టం.. వారికి ఆపాయింట్ మెంట్ ఇవ్వ‌లేదు.

ఇలాంటి అనుభ‌వం ఎప్పుడూ ఎదురుకాని వామ‌ప‌క్ష నేత‌ల‌తో స‌హా.. విపక్షాలు కేసీఆర్ తీరుకు షాక్ తిన్నాయి. రాజ‌కీయంగా ఎంత స్థాయిలో విభేదాలు ఉన్నా.. పార్టీల నేత‌లు వ‌స్తే.. వారిని వెంట‌నే క‌ల‌వ‌టం.. వారితో మాట్లాడ‌టం.. వారు చెప్పింది విన‌టం లాంటివి చేస్తుంటారు. అందుకు భిన్నంగా రాజ‌కీయంగా త‌న‌ను విమ‌ర్శించే వారిని ఎందుకు క‌ల‌వాల‌న్న‌ట్లుగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించి విప‌క్షాల‌కు షాకిచ్చారు.

తాజాగా కేసీఆర్ రూట్లోనే న‌డుస్తున్నారా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి? అన్న సందేహం క‌లిగేలా కుమార‌స్వామి వ్య‌వ‌హ‌రించారు. తాజాగా క‌ర్ణాట‌క సీఎంను క‌లిసేందుకు శాండిల్ వుడ్ లో ప్ర‌ముఖ న‌టుడిగా పేరున్న హుచ్చ వెంక‌ట్ ముఖ్య‌మంత్రి ఇంటికి వెళ్లారు. అయితే.. అక్క‌డ సీఎంను క‌లిసేందుకు చాలాసేపు వెయిట్ చేశాడ‌ట‌. అయితే.. సీఎంగారు చాలా బిజీగా ఉండ‌టంతో హుచ్చ వెంక‌ట్ కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేక‌పోయార‌ట‌. దీంతో.. తీవ్ర నిరాశ‌కు గురైన హుచ్చ వెంక‌ట్ ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌కుండానే వెన‌క్కి వ‌చ్చేశారు. ప్ర‌ముఖుల‌కు షాకిచ్చే సీఎంల జాబితాలో కుమార‌స్వామి ఎక్కిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు