Begin typing your search above and press return to search.

దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లే కీలకం కానున్నాయి..!!

By:  Tupaki Desk   |   18 Sept 2018 7:00 AM IST
దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లే కీలకం కానున్నాయి..!!
X
దేశ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చే బిల్లు ముందుకు సాగడం లేదు.. కానీ, చట్ట సభల్లో అడుగు మోపుతున్న ప్రతి పురుషుడి విజయంలోనూ మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళల ఓట్లే ప్రధానంగా ఎందరో అభ్యర్థులు చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. 2019 ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లే కీలకం కానున్నారు.. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లే కీలకం కానున్నాయి.

1990వ దశకంలో ఎన్నికల్లో ఓటేసిన పురుషులు - మహిళల మధ్య పదిశాతానికి పైగా తేడా ఉండేది. 2014 ఎన్నికల్లో ఓటేసిన మహిళల సంఖ్య 65.5 శాతానికి చేరుకుంది. అదే ఎన్నికల్లో 67 శాతం పురుషులు ఓటేశారు. అంటే పురుషులతో పోలిస్తే ఓటేసిన మహిళల సంఖ్య ఒకటిన్నర శాతం మాత్రమే తక్కువ. ఏకంగా దేశంలోని 87 లోక్‌ సభ నియోజక వర్గాల్లో పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. ఈసారి రిజిస్టర్‌ చేసుకున్న పురుషుల ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్లే కంటే ఎక్కువే. అంతేకాదు... రిజిస్టర్‌ చేసుకున్న మహిళల్లో అత్యధికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

1994 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్‌ సరళి చూస్తే పురుషుల కన్నా మహిళలే కాంగ్రెస్‌ వైపు ఎక్కువ మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి రెండు - మూడు శాతం తక్కువ మంది మహిళలు ఓట్లు వేశారు.

దేశంలో లోక్‌ నీతి జరిపిన జాతీయ ఎన్నికల అధ్యయనం ప్రకారం 2014 లోక్‌ సభ ఎన్నికల అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్‌ పార్టీకి ఒకే రీతిన అంటే - 19 శాతం పురుషులు - 19 శాతం పురుషులు ఓట్లు వేశారు. అదే బీజేపీకి 33 శాతం మంది పురుషులు ఓటేయగా - 29 శాతం మంది మహిళలు ఓటేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్‌ కు స్త్రీ - పురుషులు సమానంగా వేయగా - ప్రతి చోటా బీజేపీకి పురుషుల కన్నా స్త్రీలు తక్కువ సంఖ్యలో ఓటేశారు.