Begin typing your search above and press return to search.

గతం లో అయోధ్య ఎలా ఉంది.. ఇప్పుడె లా ఉంది?

By:  Tupaki Desk   |   11 Nov 2019 8:07 AM GMT
గతం లో అయోధ్య ఎలా ఉంది.. ఇప్పుడె లా ఉంది?
X
ఏకంగా 134 ఏళ్లు గా సాగుతున్న అయోధ్య వివాదానికి తెర దించుతూ సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు ను ఇవ్వటం తెలిసిందే. జాతి జనులంతా ఆసక్తి గా చర్చించుకుంటున్న అయోధ్య నగరానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న డిమాండ్ తాజా గా తెర మీదకు వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అయోధ్య ఇష్యూ ఇంత హాట్ టాపిక్ గా మారటాని కి కారణమైన రామాలయాన్ని నిర్మించలాంటే మరెంత కాలం పడుతుందన్నది మరో ప్రశ్నగా మారింది. అయోధ్య లో రామాలయాన్ని నిర్మించాలంటే ఐదేళ్లు పట్టటం ఖాయమని చెబుతున్నారు.

ఇదంతా బాగానే ఉంది. అసలు అయోధ్య ఎక్కడ ఉంది. దాని చరిత్ర ఏమిటి? అయోధ్య నగరం విశిష్ఠత గురించి తవ్వుకుంటూ వెళితే.. వేలాది సంవత్సరాలు వెనక్కి వెళ్లొచ్చు. ఇదో ప్రత్యేకత గా చెప్పాచ్చు. అయోధ్య నగరానికి సంబంధించిన హిస్టరీని చూస్తే.. రాముడి తోనే మొదలవుతుంది. పురాణాల్లో చెప్పే త్రేతాయుగం లో దశరథ మహా రాజు ఏలిక కోసల రాజ్యానికి అయోధ్య నగరం రాజధాని గా చెబుతారు. ఇక్కడే హిందువుల ఆరాధ్య దైవం రాముడి జననం ఈ ప్రాంతం లోనే జరిగిందన్నది విశ్వాసం.

సీతాదేవి ని పెళ్లాడిన రాముడు రాజధాని చేరుకోవటం.. అరణ్యవాసం.. రావణ సంహారం.. తిరిగి అయోధ్య కు రావటం.. పట్టాభిషేకం.. గర్భం దాల్చటం.. అనూహ్య పరిణామాల్లో అయోధ్యను సీత వీడాల్సి రావటం.. అశ్వమేథ యాగం.. సీతారాముల పరిణ్యానం.. అనంతరం కుశుడి రాజ్యపాలన ఇలా రామాయణం లోని ప్రధాన ఘట్టాల కు అయోద్య నగరమే సాక్షి అని చెబుతారు.

అప్పట్లో ప్రస్తావించిన అయోధ్య ఇప్పుడు చూస్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని సరయూ నది ఒడ్డున వెలిసిన నగరంగా చెప్పాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణ జనాభా 59వేల మంది కాగా.. అందులో పురుషులు 31వేల మంది మహిళలు పాతిక వేలమందిగా చెబుతారు. అక్షరాస్యత శాతం 78 శాతంగా చెబుతారు.

అయోధ్య నగరం హిందువుల కే కాదు.. జైనులకు కూడా దివ్య క్షేత్రమే. ఎందుకంటే జైన మత స్థాపకుడు రిషభ నాథుడు.. బైద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఇద్దరూ ఇక్కడ కొంత కాలం జీవించారని చెబుతారు. కాలక్రమం లో అయోధ్య పేరు సాకేత్ గా మారిందని.. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో అశోకుడు ఇక్కడ స్థూపం సైతం నిర్మించాడు.

మనకు కాస్త దగ్గరగా ఉన్న సమయాని కి వెళితే.. అయోధ్య నగర చరిత్ర క్రీస్తుశకం 975-1187 మధ్యన గజనీ.. ఘోరీలు చేసిన దండయాత్రలతో ఇక్కడి మందిరాలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ సుల్తానుల కాలం లో చివరి లోడీ రాజును ఓడించిన బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ ఆదేశం తో ఆయన సైనికాధికారి మీర్ బాఖి 1528లో అయోధ్య లోని రాముడి ఆలయాన్ని కూల్చి మసీదు ను నిర్మించినట్లు హిందువులు చెబుతారు. గుడి శిధిలాల మీద మసీదు నిర్మించినట్లు గా మరో వాదన ఉంది.

దీంతో.. అయోధ్య అప్పటి వరకూ హిందువులు.. జైనులు... బౌద్ధులకే మాత్రమే కాదు ముస్లింలకు కావాల్సిన నగరంగా మారింది. రాజులు.. రాజ్యాలతో పాటు మారే కాలాని కి అనుగుణంగా అయోధ్య మారుతూ వచ్చింది. చివరకు అది కనౌజ్ రాజ్యంగా అవతరించింది. క్రీ.శ.11వ శతాబ్దంలో అది కాస్తా అవధ్ గా మారింది. తర్వాత ఢిల్లీ సుల్తానుల చేతుల్లోకి వెళ్లి.. అది పతనమయ్యాక జాన్ పూర్ లో భాగమైంది. 16వ శతాబ్దంలో మొఘలుల వశమైంది. మూడో పానిపట్లు యుద్ధం తర్వాత ఈస్టిండియా కంపెనీ కి సామంత రాజ్యంగా మారింది.

1856లొ బ్రిటీష్ ప్రభుత్వం తన సామ్రాజ్యం లో అయోధ్య ను కలుపుకున్నారు. అవధ్ ప్రాంతం కాస్తా 1877లో ఆగ్రా ప్రెసిడెన్సీలో కలిపి నార్త్ వెస్ట్రన్ ఫ్రావిన్సులో భాగమైంది. తర్వాతి కాలంలో అదే అగ్రా అవధ్ గా యూనైటెడ్ ఫ్రావిన్నెస్ గా మారింది.స్వాతంత్ర్యం వచ్చిన తర్వత దీన్ని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఫైజాబాద్ జిల్లాలో కలిపారు. ఇంతటి ఘన చరిత్ర అయోధ్య సొంతం.