Begin typing your search above and press return to search.

మీ పాన్ స్టేట‌స్ ఇలా తెలుసుకోవ‌చ్చు

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:23 AM GMT
మీ పాన్ స్టేట‌స్ ఇలా తెలుసుకోవ‌చ్చు
X
పాన్ కార్డుల అవ‌స‌రం ఇప్పుడు పెరిగింది. చాలా సంద‌ర్భాల్లో ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల కింద పాన్ కార్డును చూపించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఇలాంటి వేళ‌.. ఆదాయ‌ప‌న్ను విభాగం దాదాపు 11.44 ల‌క్ష‌ల శాశ్విత పాన్ కార్డుల్ని తాత్కాలికంగా చెల్లుబాటు కాకుండా నిలిచిపోయేలా చేసింది.

న‌కిలీ ధ్రువ‌ప‌త్రాల‌తో పాన్ కార్డులు పొందార‌న్న సందేహాలున్న వాటితో పాటు.. ఒకే వ్య‌క్తికి ఒక‌టి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందార‌న్న సందేహం ఉన్న వాటిని తాత్కాలికంగా చెల్లుబాటు కాకుండా హోల్డ్ చేశారు. మ‌రి.. మీ ద‌గ్గ‌రున్న పాన్ కార్డు.. మీ త‌ప్పు లేకుండా కూడా హోల్డ్ లోకి వెళ్లిపోయిందా? ఒక‌వేళ అలాంటిదే జ‌రిగింద‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌టం ఎలా అన్న సందేహం రావ‌టం ఖాయం.

అలాంటి ఇబ్బందిని తెలుసుకోవ‌టానికి వీలుగా ఒక వెసులుబాటును క‌ల్పించింది ఆదాయ‌ప‌న్ను విభాగం. సులువైన ప‌ద్ధ‌తిలో పాన్ కార్డు లేటెస్ట్ స్టేట‌స్‌ను తెలుసుకునే వీలుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..

1. ఆదాయ‌ప‌న్నువారి ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

2. ఇ-ఫైలింగ్ హోం పేజీలో స‌ర్వీసెస్ విభాగంలో ఉండే నో యువ‌ర్ పాన్ అనే లింక్ క్లిక్ చేయాలి.

3. అక్క‌డ పేర్కొన్నట్లు పేరు.. పుట్టిన‌తేదీ.. పాన్ తో అనుసంధాన‌మైన మొబైల్ నెంబ‌రు వివ‌రాలు న‌మోదు చేయాలి.

4. ఆ వెంట‌నే మీ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.

5. దాన్ని న‌మోదు చేసిన వెంట‌నే.. మీ పాన్ కార్డు లేటెస్ట్ స్టేట‌స్ వ‌చ్చేస్తుంది.

6. ఒక‌వేళ మీ పాన్ కార్డు చెల్లుబాటు కాకుంటే.. మీకు సంబంధించిన అద‌న‌పు స‌మాచారాన్ని అడుగుతుంది. ఆ వివ‌రాలు ఇస్తే స‌రిపోతుంది.