Begin typing your search above and press return to search.

బెడ్ రూంలో సెక్స్ వేళ చేయకూడని పనులివే..

By:  Tupaki Desk   |   8 April 2020 7:00 AM IST
బెడ్ రూంలో సెక్స్ వేళ చేయకూడని పనులివే..
X
శృంగారంలో పాల్గొనడం వల్ల చక్కటి రిలీఫ్ లభిస్తుందనే సంగతి తెలిసిందే. రతి క్రీడను స్త్రీ పురుషులిద్దరూ ఆస్వాదించాలి. అప్పుడే పార్టనర్‌కు మనపై ప్రేమ పెరుగుతుంది. ఒంటెద్దు పోకడ వల్ల మీకు సౌఖ్యం తప్పితే తనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. లవర్ లేదా వైఫ్‌తో బెడ్రూంలో ఏకాంతంగా గడిపేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. బెడ్రూం లో కొన్ని పనులు చేయడం వల్ల అసలుకే ఎసరు వస్తుంది. పడక గదిలో చేయకూడని పనులేంటో చూద్దాం.

*నమ్మశక్యంగా లేకపోయినా.. చాలా మంది శృంగారంలో పాల్గొనేటప్పుడు ముద్దు పెట్టుకోరు. రతిలో పాల్గొనాలనే తొందర కావచ్చు, లేదంటే యాంగ్జయిటీ కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు. కానీ శృంగారానికి సన్నద్ధం అవుతున్నప్పుడు భాగస్వామిని కిస్ చేయడం ముఖ్యం. దీని వల్ల తనకు చక్కటి హాయి లభిస్తుంది.

*శృంగారంలో భాగస్వామిని చిలిపిగా కొరకడం సాధారణమే. దీన్ని చాలా మంది ఇష్టపడతారు కూడా. కానీ పూర్తిగా రంగంలోకి దిగక ముందే కొరకడం వల్ల ఫలితం ఉండదు. అది వారికి నొప్పిని, అసౌకర్యాన్నికలిగిస్తుంది. ఫలితంగా మీరంటేనే వారు భయపడే అవకాశం ఉంది. కాబట్టి మీ పార్టనర్ మూడ్ బాగున్నప్పుడే తన భుజాలు, మెడ లేదా చెవి వంటి కామాన్ని ప్రేరేపించే భాగాల్లో సున్నితంగా కొరకండి.

*కొంత మంది బెడ్రూంలో ఏకాంతంగా గడిపేటప్పుడు పార్టనర్‌ మీద పడి పోతుంటారు. అమ్మాయిలైనా ఇలా పడిపోవడం సరికాదు. మీ బరువు మొత్తం ఎదుటి వ్యక్తి మీద పడితే ఇబ్బంది పడతారు. శ్వాస తీసుకోవడం కష్టమైతే.. వారు సహకరించడం కుదరదు.

*ఓరల్ సెక్స్ లేదా మామూలు శృంగారంలోనైనా క్లయిమాక్స్ చేరుకునేటప్పుడు పార్టనర్‌ కు ముందే చెప్పడం ఎంతో ముఖ్యం. ఇది ఆడవాళ్లకు కూడా వర్తిస్తుంది.

*చాలా జంటలు కాస్త అసభ్యంగా ఉండే రతి క్రీడను కూడా ఆస్వాదిస్తాయి. కానీ అలా ప్రవర్తించడానికి ముందు పార్టనర్‌తో మాట్లాడి.. ఒప్పుకుంటేనే చేయాలి.

*ఏకాంతంగా ఇద్దరూ ఎంజాయ్ చేసే టైంలో పార్టనర్ మాట్లాడాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి నోరు మెదపకుండా కూర్చునే బదులు.. ఏదైనా మాట్లాడటమో లేదంటే.. తీపి శబ్దాలు చేయడమో చేయండి. ఇలా చేయడం వల్ల పార్టనర్‌కు ఉత్సాహం వస్తుంది.

*శృంగారాన్ని ఆస్వాదించాలి కానీ యాంత్రికంగా ఏదో చేశాం అనిపించకూడదు. అదేమీ జిమ్ కాదు కదా. చాలా మంది మొదట్లో ఈ విషయంలో బాగానే ఉంటారు. కానీ కాలం గడిచే కొద్దీ ఏదో మొక్కుబడిగా ముగిస్తుంటారు. కాస్త క్రియేటివ్‌ గా, వినూత్నంగా ప్రయత్నించడం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.