Begin typing your search above and press return to search.
భారత్ బంద్ ను టీఆర్ఎస్ ఎంత సీరియస్ గా తీసుకుంటుందంటే?
By: Tupaki Desk | 8 Dec 2020 9:34 AM ISTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారత్ బంద్ లకు కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. ఆ సందర్భంగా తెలంగాణలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? తాజా భారత్ బంద్ సందర్భంగా ఏం జరుగుతందన్నది చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చేతిలో అధికారంలో ఉన్న వారికి నచ్చితే ఒకలా.. నచ్చకుంటే మరోలా అనే తేడా మరీ ఇంతలానా? అన్న భావన కలుగక మానదు. గతంలో భారత్ బంద్ కు పిలుపు ఇచ్చి.. విపక్షాలు ఆందోళనలకు సిద్ధమైతే.. హౌస్ అరెస్టులు చేయటమే కాదు.. ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేసేవారు. అందుకు భిన్నంగా ఈ రోజు జరుగుతున్న భారత్ బంద్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన పార్టీ వర్గాల వారికి.. నేతలను కోరారు.
అధినేత ఆదేశించిన తర్వాత గులాబీ దండు తగ్గుతుందా? భారత్ బంద్ ను విజయవంతం చేసేందుకు భారీ కార్యాచరణను సిద్ధం చేశారు. బంద్ కు సంఘీభావంగా పలువురు మంత్రులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిదులు పాల్గొంటున్నారు. పలువురు నేతలు.. వారు ప్రాతినిధ్యం వహించే జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసనలో పాల్గొంటుంటే.. మంత్రులు కేటీఆర్.. హరీశ్ లు సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
బూర్గులలో రైతులతో కలిసి కేటీఆర్ ధర్నా నిర్వహిస్తుంటే.. మరో మంత్రి హరీశ్.. తుప్రాన్ వై జంక్షన్ వద్ద రాస్తారోకో చేస్తున్నారు. సాధారణంగా నిరసనలు చేసే వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తాజాగా అధికార పక్షమే బంద్ కు మద్దతు ఇవ్వటంతో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ప్రజాస్వామ్య భారతంలో చట్టం అందరికి సమానమే అయినప్పుడు.. తెలంగాణలో నిరసనలు.. ఆందోళనలు.. రాస్తారోకోల సందర్భంగా పోలీసులు వ్యవహరించే తీరుకు.. ఈ రోజు వారి వ్యవహారశైలి తీరుకు తేడా చూడాల్సిందే. అధికారం చేతిలో ఉన్న వారు వ్యవస్థల్ని ఎంతలా ప్రభావితం చేస్తారో ఈ రోజు బంద్ ను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.