Begin typing your search above and press return to search.

సెలబ్రిటీ అయితే మాత్రం మాస్కు లేకుండా రానిచ్చుడా సారూ?

By:  Tupaki Desk   |   20 July 2020 4:30 PM GMT
సెలబ్రిటీ అయితే మాత్రం మాస్కు లేకుండా రానిచ్చుడా సారూ?
X
పెద్దా.. చిన్న అన్న తేడా ఉండదు మాయదారి వైరస్ కు. సామాన్యుడు.. ప్రముఖుడన్నది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే కరోనా దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. భౌతికదూరం పాటించటం.. శానిటైజ్ చేసుకోవటం.. అన్నింటికి మించి ముఖానికి మాస్కు పెట్టుకోవటం తప్పనిసరి. ఈ విషయాల్ని గడిచిన నాలుగు నెలలుగా చెప్పిందే చెబుతున్నారు.

అయినప్పటికి ముఖానికి మాస్కు పెట్టుకునే విషయంలో ప్రముఖులు కొందరు అనుసరిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదంటున్నారు. పెళ్లి పెట్టుకున్న వేళ.. నితిన్ లాంటి సెలబ్రిటీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి యాబై మందికి మించకూడదన్న రూల్ నేపథ్యంలో తనకు అత్యంత సన్నిహితులను మాత్రమే పిలుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రముఖుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను చేర్చిన ఆయన.. ప్రగతిభవన్ లో కలిసి శుభలేఖను ఇచ్చారు.

తెలంగాణకు పెద్దాయనకు శుభలేఖ ఇవ్వటానికి మించింది ఏముంటుందన్నది పాయింటే. మరి.. శుభలేఖ ఇచ్చే వేళ.. ముఖానికి ఉండాల్సిన మాస్కు లేకపోవటం ఏమిటి? ఒకవేళ ఫోటోకు ఫోజు ఇవ్వాలనుకున్నప్పుడు కనీసం.. మెడకు దాన్ని వేలాడదీసుకున్నా.. మెసేజ్ బాగుంటుంది కదా? నితిన్ తో పోలిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్.. మెడ చుట్టూ కండువా చుట్టుకోవటం చూస్తే.. ఆయన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. కేసీఆర్ కు వెనగ్గా ఉన్న అటెండరు సైతం.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం మాస్కు లేకుండా ఎలా రానిచ్చినట్లు?

ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన వేళలో.. ఇలా ముఖానికి మాస్కు లేకుండా పోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇలాంటి వాటిని సీఎం కేసీఆర్ ఎలా అనుమతిస్తారు? ఒకవేళ కొత్తగా పెళ్లి చేసుకునే హడావుడిలో ఉన్నాడని ఊరుకున్నా.. హెచ్చరించాలి కదా? పెళ్లి చేసుకునే హడావుడిలో ఇలా ముఖానికి మాస్కు లేకుండా ఉంటే ఎలా బాబు అని చెప్పాలి కదా? అయినా.. నితిన్ పెళ్లి పెట్టుకొని ఇలా బాధ్యత లేకుండా ఉండటం ఏమిటి చెప్పండి?