Begin typing your search above and press return to search.
6 గంటలు ఆగిన ఫేస్ బుక్ తో జుకర్ కు ఎంత భారీ నష్టమంటే?
By: Tupaki Desk | 5 Oct 2021 12:01 PM ISTదాదాపు పదిహేడేళ్ల క్రితం ఫేస్ బుక్ ను స్థాపించారు. వర్సిటీ కాలేజీలో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ.. ఇప్పడు ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసే మీడియంగా మారింది. ఆ మాటకు వస్తే.. ప్రపంచంలోని చాలా దరిద్రాలకు ఫేస్ బుక్ కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని చెప్పకతప్పదు. ఫేస్ బుక్ బొకేలో ఫేస్ బుక్ మెసెంజర్.. ఇన్ స్టా.. వాట్సాప్ సేవలు ఆరు గంటలు ఆగితే.. అదే సమయంలో ట్విటర్.. టిక్ టాక్.. స్నాప్ చాట్ సేవలు సైతంకాస్త నెమ్మదించాయి.
దాదాపు ఆరు గంటలకు పైనే ఆగిన ఫేస్ బుక్ సేవల కారణంగా దాని సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు జరిగిన నష్టం అంతా ఇంతా కాదంటున్నారు. తీవ్ర నష్టమే జరిగిందని.. ప్రపంచ కుబేరుల స్థానం నుంచి కిందకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. అంతేకాదు.. కంపెనీ షేర్ భారీగా ప్రభావితమైందని చెబుతున్నారు. ఆరు గంటల పాటు పని చేయని ఫేస్ బుక్ కారణంగా మార్క్ జుకర్ కు ఏకంగా మన రూపాయిల్లో చెప్పాలంటే 50వేల కోట్ల వరకు నష్టం వాటిల్లింది. అంతేకాదు.. అపర కుబేరుడు జాబితా నుంచి కిందకు పడిపోయాడు.
ఫేస్ బుక్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత సేపు ఫేస్ బుక్ పని చేయకుండా లేదని.. ఇదే తొలిసారి అని గుర్తు చేస్తున్నారు. సెప్టెంబరు మధ్య నుంచి ఫేస్ బుక్ స్టాక్ 15 శాతం పడితే.. ఒక్క సోమవారమే చోటు చేసుకున్న నష్టం ఎక్కువని.. స్టాక్ లో ఐదు శాతం పడిపోయినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు అపర కుబేరుల్లో ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి జారిపోయారు. తప్పు ఎవరు చేసినా.. భారీ నష్టం మాత్రం జుకర్ కే తగిలిందన్న మాట వినిపిస్తోంది.