Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగులకు ఇంత నష్టముందా?

By:  Tupaki Desk   |   6 Oct 2020 7:00 AM IST
వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగులకు ఇంత నష్టముందా?
X
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల జీవన శైలితోపాటు ఉద్యోగం, వ్యాపారం చేసే విధానాల్లోనేూ గణనీయమైన మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఐటీతో పాటు కొన్ని పరిమిత రంగాలకు పరిమితమై వర్క్ ఫ్రం హోం...ఇపుడు అనేక రంగాలకు పాకింది. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఇపుడు చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసస్తున్నారు. అయితే, వర్క్ ఫ్రం హోం వల్ల కొన్ని లాభాలున్నట్టే...కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వర్క్ ఫ్రం హోం చేసేటపుడు వచ్చే వ్యక్తిగత ఇబ్బందులను అధిగమించడంతోపాటు ఈ విధానంలో పనిచేయడం వల్ల కొన్ని ఎలవెన్స్ లు కోల్పోవడం, కొన్ని ఎలవెన్స్ లపై పన్నులు కట్టాల్సిన అవకాశం ఉండడం ఇందులో ప్రతికూలతలు. ఆఫీసులో పనిచేసేటపుడు వేతనం, అలవెన్స్‌లు (మినహాయింపుల్లో ఉన్నవి కాకుండా) పన్ను పరిధిలోకే వస్తాయి. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ), లీవ్‌ ట్రావెల్‌ అలవెన్స్‌ (ఎల్‌టీఏ) వంటివాటికి నిర్దేశిత పరిమితుల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

కరోనా వల్ల కంపెనీ పనుల మీద, ఇంటి నుంచి ఆఫీసుకు ట్రావెలింగ్ చేసే అవకాశాలు తక్కువ. వీటికి సంబంధించిన అలవెన్స్‌లను ఖర్చు చేసే పరిస్థితి లేదు కాబట్టి వాటికి పన్ను చెల్లించాల్సి రావచ్చు. వీటికి సంబంధించి ఆర్థిక సంవత్సరం ప్రారంభం లోనే (ఏప్రిల్‌) ఉద్యోగులు తమ పెట్టుబడులు, ట్యూషన్‌ ఫీజుల అంచనాలు, ఇంటి అద్దె చెల్లింపుల వివరాలను పనిచేస్తున్న సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. వాటి ప్రకారమే ఉద్యోగి వేతనం నుంచి పన్ను మినహాయించి ఆదాయపన్ను శాఖకు కంపెనీలు చెల్లింపులు చేస్తాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన వివరాల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఏడాది చివర్లో కంపెనీకి ఇచ్చే వివరాల్లో తెలియజేయాలి. అపుడు దానిని బట్టి పన్ను చెల్లింపుల్లో హెచ్చుతగ్గులుంటాయ. ఇక, కరోనా దెబ్బకు ఎల్‌టీఏకు వెళ్లేందుకు ఎవరు ఇష్టపడడం లేదట.దీంతో కొందరు ఉద్యోగులు ఎల్‌టీఏ అలవెన్స్‌పై పన్ను చెల్లించుకోవాల్సి వచ్చే అవకాశముంది. ఇక వర్క్ ఫ్రం హోం కోసం ఫర్నిచర్ ఎట్సెట్రా ఖర్చుల కోసం కంపెనీలు ఉద్యోగులకు డబ్బులిస్తున్నాయి. వాటిపై పన్ను పడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.