Begin typing your search above and press return to search.
ఎన్నికల వ్యయాన్ని 10 శాతం పెంచిన కేంద్రం .. ఎంపీ , ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టుకోవచ్చంటే ?
By: Tupaki Desk | 21 Oct 2020 4:40 PM ISTఅతి త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈసీ విడుదల చేసింది. ఈ తరుణంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కంటే అదనంగా మరో 10 శాతం వరకు ఖర్చు చేసుకునేందుకు అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది.కొత్త నిబంధనల ప్రకారం .. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటివరకు రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.77 లక్షలు చేశారు.
అలాగే , చిన్న రాష్ట్రాల లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి ఖర్చుని రూ.54 లక్షల నుంచి రూ. 59 లక్షలకి పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తాజా సవరణలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సవరించిన నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయన్న కేంద్రం స్పష్టం చేసింది. ఇక , పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రాల్లో అభ్యర్థులు గరిష్ఠంగా ఖర్చు చేసుకునే మొత్తం ప్రస్తుతం ఉన్న రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకు పెరిగింది. చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ మొత్తం ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు పెరిగింది. కరోనా సంక్షోభం నేపథ్యంలోనే ఎన్నికల వ్యయ పరిమితిని పెంచినట్టుగా తెలుస్తోంది.
బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలి దశ పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో దశ పోలింగ్ ఉంది. ఈ ఎన్నికల నేపథ్యంతో తాజా నిర్ణయం అభ్యర్థుల గెలుపోటములపై కాస్త ప్రభావం చూపనుంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇది కలిసిరానుండగా .. ఆర్థికంగా అంత బలంగా లేని అభ్యర్థులకు ఇది మరో భారం కాబోతుంది. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ రోజున, అంతకు ముందు రోజున ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు.. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ని అనుసరించి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనలపై నిషేధం విధించింది.