Begin typing your search above and press return to search.

కూతురు పెళ్లికి బిల్ గేట్స్ ఎంత ఖర్చు చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Oct 2021 9:00 PM IST
కూతురు పెళ్లికి బిల్ గేట్స్ ఎంత ఖర్చు చేశాడో తెలుసా?
X
మన దేశంలో కొందరు సేవ చేయమంటే జేబులు తడుముతారు గానీ.. కొన్ని శుభకార్యాలకు మాత్రం స్థాయికి మించి డబ్బులను ఖర్చు చేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లను తమ హోదాకు సరిపోయే విధంగా చేస్తుంటారు. సాధారణ వ్యక్తులు సైతం కోట్ల రూపాయలు వివాహ కార్యక్రమానికి వెచ్చిస్తారు. భారత కుభేరుడు అనిల్ అంబానీ తన కుమార్తె పెళ్లికు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. అయితే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అయిన బిల్ గేట్స్ కుమార్తె పెళ్లికి ఎంత ఖర్చు చేయాలి..? అంతకుమించే అనుకుంటున్నారా..? అదేం కాదు... బిల్ గేట్స్ తన కుమార్తె కోసం వెచ్చిన మొత్తాన్ని చూస్తే షాక్ తినడం ఖాయం..

బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ పెళ్లి ఇటీవల జరిగింది. తాను ప్రేమించిన వ్యక్తి నాయెల్ నాజర్ ను కేథరిన్ వివాహం చేసుకుంది. వీరిద్దరు కలిసి స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. నాజర్ ఈజిప్టియన్ జాతికి చెందిన వ్యక్తి అయినా సంపన్న కుటుంబానికి చెందిన వాడే. చాలా కాలం నుంచే వీరు ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా డేటింగ్ కూడా చేస్తున్నారు. దీంతో బిల్ గేట్స్ వీరి ప్రేమను ఒప్పుకోక తప్పలేదు. అయితే తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నా.. అమ్మానాన్న విడిపోవడం దురదృష్టంగా ఉందని జెన్నీఫర్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ‘వోగ్’ అనే మ్యాగ్జిన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

‘వాస్తవానికి మా పెళ్లి ఎంతో ఘనంగా చేసుకుందామని అనుకున్నాం. కానీ కరోనా కారణంగా అది కుదరలేదు. సన్నిహితులు, బంధువుల మధ్యే ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా 300 మంది వచ్చారు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే దురదృష్టమేంటంటే నా పెళ్లికి అమ్మానాన్న కలిసి ఉండకపోవడమే. అయినా నా ప్రేమను వారు ఆంగీకరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ’ అని తెలిపారు.

ఇక బిల్ గేట్స్ దంపతులు విడిపోయవడంతో ఆయన భార్య మెలిండా దగ్గరుంచి పెళ్లి పనులు చూసుకుంది. బిల్ గేట్స్ మాత్రం ఒక్కరోజు ముందు వచ్చారు. అయితే గేట్స్ తనకు ఎంతో ఆస్తి ఉన్నా ఈ పెళ్లికి మాత్రం 2 మిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేశాడట. అంటే ఇండియన్ కరెన్నీ ప్రకారం 14 కోట్ల రూపాయలన్నమాట. కరోనా కారణంగా వీఐపీలు, ప్రముఖులను పిలవలేదు. అంతేకాకుండా కరోనా నిబంధనలు ఉండడంతో ఆడంబరం చేయలేదు. అంతేకాకుండా పెళ్లికి వచ్చేవారు నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలనే నిబంధనపెట్టారు. దీంతో మరికొంత మంది పెళ్లికి హాజరు కాలేదు.

అతికొద్ది మంది సమక్షంలో పెళ్లి వేడుక నిర్వహించినా రెండు రోజుల పాటు ఉత్సాహంగా గడిపామని జెన్నిఫర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం న్యూయార్క్ లోని ఉత్త సేలంలో ఉన్న 142 ఎకరాల ఎస్టేట్లో బహిరంగ వివాహ వేడుకను నిర్వహించారు. ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్ చేశాయి. కస్టమ్ వెరా వాంగ్ డిజైన్ చేసిన గౌనును జెన్నిఫర్ ధరించారు. ఈ వేడుకను వారంతంలో నిర్వహించారు. ఇక జెన్నీఫర్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అయితే ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ తన కుమార్తె పెళ్లి ఇంత సింపుల్ గా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే సాధారణ పరిస్థితులు ఉంటే అతిరథ మహారథులు హాజరయ్యేవారని అనుకుంటున్నారు. మరోవైపు తాను భార్యతో విడాకులు తీసుకోవడం బిల్ గేట్స్ జీవితంలో విషాదం నింపిందని అంటున్నారు. ఈ రెండు కారణాలతో బిల్ గేట్స్ తన కుమార్తె పెళ్లిలో హ్యాపీగా కనిపించడం లేదని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.