Begin typing your search above and press return to search.

రాజా? లేక అపర కుబేరుడా ? .. బంగారు భవనం.. ఏడు వేల లగ్జరీ కార్లు.. !

By:  Tupaki Desk   |   12 Feb 2021 8:00 AM IST
రాజా? లేక అపర కుబేరుడా ? .. బంగారు భవనం.. ఏడు వేల లగ్జరీ కార్లు.. !
X
ఈ ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికే రాచరికం అంతమైనా.. ఇప్పటికీ పలు దేశాలు ఆ శిథిలాలు మిగిలే ఉన్నాయి. రాజు స్వయంగా అధికారంలో లేకపోయినా అంతా ఆయన చెప్పుచేతల్లో నడవాల్సిందే. ఇటువంటి దేశమే బ్రూనై. ఈ దేశంలో సుల్తాన్ గా వ్యవహరిస్తున్న హసనల్ బొల్కియా ఆ దేశానికి రాజు.. బంగారంతో తాపడం చేసిన 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యంత లగ్జరీ ప్యాలెస్,బంగారం పూత పూసిన సొంత విమానం, ఏకంగా 7వేల లగ్జరీ కార్లు ఇంకా బంగారంతో చేసిన వస్తువలకు లెక్కేలేదు. అతని లగ్జరీ గురించి వింటే అతడు రాజా లేక కుబేరుడా అనే డౌట్ రాకమానదు.

ఇస్తానా నూరుల్ ఎమాన్ ప్యాలెస్ ను 1984లో ఆయన నిర్మించుకున్నారు. ఇది 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ల బంగారంతో నిండి ఉంది. ఈ ప్యాలెస్ విలువ రూ. 2,550 కోట్లకు పైమాటే. ఈ భవంతిలో 1700 కి పైగా గదులు, 257 బాత్రూంలు, ఐదు స్విమ్మింగ్ పూల్స్, 110 గ్యారేజీలు, గుర్రాలకు 200 ఎయిర్ కండిషన్డ్ గదులున్నాయి. హసనల్ కు సొంతంగా ఏడు వేల కార్లున్నాయి. అవన్నీ ఏదో అల్లాటప్పా కార్లు కాదు. అన్నీ లగ్జరీ కార్లే. వీటి విలువ సుమారు 341 బిలియన్ డాలర్లు. వీటిలో 600 రోల్స్ రాయిస్, 300 ఫెరారీలను కలిగి ఉన్నాడు.

ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన సుల్తాన్లనో ఒకరు. 1980 వరకు ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు హోదా అనుభవించాడు. ఒక నివేదిక ప్రకారం.. హసనల్ బొల్కియా కు రూ. 14,700 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అంతేగాక.. హసనాల్ కు అనేక ప్రైవేట్ జెట్ లు కూడా ఉన్నాయి. ఆయన వద్ద బోయింగ్ 747-400 బోయింగ్ 767-200, ఎయిర్ బస్ ఎ 340-200 జెట్ లు ఉన్నాయి. బోయింగ్ 747-400 జెట్ ను బంగారంతో పూత పూయించారు.

ఈ విమానంలో లివింగ్ రూమ్ సహా అన్ని సదుపాయాలున్నాయి. రాజు హస్సనల్ బొల్కియా ప్యాలెస్ లో ఎక్కడ చూసినా బంగారమే కనిపిస్తుంది. టైనింగ్ టేబుల్, తినే కంచాలు,గిన్నెలు, గ్లాసుల, స్పూన్లు,ఫోర్కులు, ఫ్లవర్ వాజ్ లు, పండుకునే మంచాలు, వేసుకునే బట్టలు, ఆఖరికి బాత్రూమ్ లో బాతింగ్ టబ్ లు కూడా బంగారంతో చేసినవే. సోప్ బాక్సులు, ఇలా ఏది చూసినా బంగారంతో చేసినవే కనిపిస్తాయి.