Begin typing your search above and press return to search.

మన దేశం లో ఎన్ని రాష్ట్రాలలో మండలి వ్యవస్థ ఉందంటే ?

By:  Tupaki Desk   |   24 Jan 2020 11:14 AM IST
మన దేశం లో ఎన్ని రాష్ట్రాలలో మండలి వ్యవస్థ ఉందంటే ?
X
ప్రస్తుతం ఏపీ లో శాసనమండలి పై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఏపీ సర్కార్ మండలిలో సరైన సంఖ్యా బలం లేక పార్టీ కీలకంగా భావించిన కొన్ని బిల్లుల్ని ఆమోదించుకోలేకపోతుంది. అలాగే తాజాగా వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లుని మండలి సెలెక్టెడ్ కమిటీ కి పంపించడం తో వైసీపీ తీవ్ర స్థాయి లో మండి పడుతూ .. మండలిని రద్దు చేసే ప్రయత్నం చేస్తునట్టు తెలుస్తుంది . ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలలో మండళ్లు ఉన్నాయి ..ఏ ఏ రాష్ట్రాల్లో శాసనమండలి వ్వవస్థ లేదు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం..

దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా 22 రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ లేదు. ప్రస్తుతం ఆరు రాష్ట్రాలలోనే శాసనమండలి వ్వవస్థ అందుబాటు లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ తో పాటు తెలంగాణ - బీహార్‌ - ఉత్తరప్రదేశ్‌ - కర్నాటక - మహారాష్ట్రలో మాత్రమే శాసన మండలి వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసే దిశగా పావులు కదుపుతుండడంతో , ఏపీ ప్రభుత్వం నిజంగానే శాసనమండలిని రద్దు చేస్తే .. ఇక దేశంలో ఐదు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు మాత్రమే ఉండే అవకాశముంది.

బీహార్‌ - కర్నాటకలో 75 మంది చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. మహారాష్ట్రలో 78 మంది, -తెలంగాణలో 40 - ఉత్తరప్రదేశ్‌లో 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. జమ్ము కశ్మీర్‌ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం తో గత ఏడాది అక్కడ శాసన మండలి ని రద్దు చేశారు. గతంలో అసోం - మధ్యప్రదేశ్‌ - తమిళనాడు - పంజాబ్‌, -పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా శాసనమండళ్లు ఉండేవి. అయితే ఈ రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ ను రద్దు చేశారు. అయితే, వీటి తో పాటుగా ఒడిశా - రాజస్థాన్‌ -ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో కూడా గత కొన్ని రోజులుగా మళ్లీ శాసనమండలి వ్యవస్థ ని తీసుకురావాలి అనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం రాష్ట్రాల్లో విధాన పరిషత్‌ లను ఏర్పాటు చేస్తారు.