Begin typing your search above and press return to search.

శృంగారానికి ఎక్కువ కాలం దూరమైతే ఎన్ని సమస్యలంటే..?

By:  Tupaki Desk   |   19 Jan 2023 2:30 AM GMT
శృంగారానికి ఎక్కువ కాలం దూరమైతే ఎన్ని సమస్యలంటే..?
X
కామశాస్త్రం తోతైన సముద్రం. దీని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అయితే శృంగారంలో స్వర్గాన్ని చూడాలంటే మాత్రం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. శృంగారంతో మానసిక ఉల్లాసమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా చిన్న చిన్న రోగాలు దరిచేరకుండా ఉంటాయి. రోజూ సెక్స్ చేయడం వల్ల సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో నిత్యం యవ్వనంగా ఉంటారు. అయితే పని ఒత్తిడి, వాతావరణం, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కలుసుకోలేకపోతున్నారు. వారంలో ఒకసారైనా సెక్స్ లో పాల్గొనకపోవడంతో మానసిక బాధలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఎక్కువగా కాలం కొనసాగితే వ్యక్తిగతంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ఈ విషయాలు బయటపడ్డాయి.

యూఎస్ 2016 ప్రకారం రెగ్యులర్ సెక్స్ చేసేవారిలో రోగ నిరోధక శక్తిని పెంచే 'ఇమ్యునోగ్లోబులిన్ A' విడుదల అవుతుంది. అలాగే వీరిలో రెండు సెక్స్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.వాటిలో ఒకటి ఎండార్పిన్, మరొకటి ఆక్సిటోసిన్. ఈ హార్మోన్లు విడుదల కాగానే మంచి నిద్రకు ఉపక్రమిస్తారు. ఇవి సంతోషాన్ని ఇస్తాయి కాబట్టి వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడినైనా జయించగలుగుతారు. అలాగే చికాకు, మానసిక ఆందోళన నుంచి బయటపడుతారు.

అయితే చాలా మంది శృంగారానికి దూరమవుతారు. నిత్యం బిజీ లైఫ్ ను గడపడంతో పాటు సమయానికి ఇంటికి రాకపోవడం వల్ల సెక్స్ పై అనాసక్తితో ఆ కార్యక్రమానికి దూరమవుతారు. ఇక భాగస్వామితో గొడవ లేదా సరైన బంధం లేని కారణంగానూ శృంగారం చేయడానికి కోల్పోతారు. ఇలా ఎక్కువకాలం దూరంగా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. నిత్య శృంగారం ఆనందాన్ని ఇస్తే.. ఎక్కువ కాలం దూరంగా ఉంటే అనేక వ్యాధులు సంక్రమిస్తాయని అంటున్నారు.

భాగస్వాములిద్దరు శృంగారంలో పాల్గొన్న సమయంలో ఎండార్పిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఎక్కువరోజులు సెక్స్ కు దూరంగా ఉంటే ఇది క్రమంగా విడుదలవడం ఆగిపోతుంది. దీంతో సంతోష కరమైన హార్మోన్లు తగ్గి నిత్యం టెన్షన్ తో గడుపుతారు. ఇలాగే కొంతకాలం గడిచాక భాగస్వామికి మీపై నమ్మకం పోతుంది. అలాగే నిత్య శృంగారం దూరమైతే యోని కణజాలం దెబ్బతింటుంది. ఇది సన్నబడి సెక్స్ చేసినప్పుడు అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. దీంతో శృంగారంలో పాల్గొన్నప్పుడు తృప్తిని పొందలేరు.

వారానికి కనీసం రెండు సార్లైనా సెక్స్ లో పాల్గొనాలని నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే రోగనిరోధక శక్తి తగ్గి చిన్న చిన్న జబ్బులకే పోరాడాల్సి ఉంటుంది. ఇలా సెక్స్ కు ఎక్కువ రోజు దూరంగా ఉన్న వాళ్లు జలుబు, ఇతర ఇన్షెక్షన్లకు తొందరగా అనారోగ్యానికి గురవుతారు. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనేవారిలో ఇలాంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. శృంగారానికి ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల మహిళల్లో ఆలస్యంగా భావోద్వేగం రావొచ్చు. దీంతో పురుషుడికి తొందరగా భావప్రాప్తి అయినా స్త్రీలో ఇంకా కోరిక తగ్గదు. దీంతో ఇద్దరి మధ్య అసమానతలు ఏర్పడుతాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.