Begin typing your search above and press return to search.

దేశంలో ఎన్ని లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారంటే !

By:  Tupaki Desk   |   29 May 2020 8:30 AM GMT
దేశంలో ఎన్ని లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారంటే !
X
చైనాలో వెలుగులోకి వచ్చిన వైరస్ కారణంగా మనదేశంలో కూడా లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించిన తర్వాత దేశవ్యాప్తంగా వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తూ అనుమానం ఉన్నవారికి క్వారంటైన్ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో మొత్తం 23 లక్షల మందికి పైగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు గుర్తించింది. మే 26 నాటికి మొత్తంగా 22 లక్షల 81 వేలమందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు వివరించింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ ను అమలు చేస్తుండగా.. అధికారిక హోదాలో మినహాయింపు ఉన్న వారిని హోం క్వారంటైన్ ‌కి పంపుతున్నారు.

మే 14 నాటికి 11లక్షల 95 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉండగా, 12 రోజుల్లోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు కేంద్రం ప్రకటించింది. మే 26 నాటికి మహారాష్ట్రలో 6 లక్షల 2 వేల మంది, గుజరాత్ ‌లో 4 లక్షల 42 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ లో 3 లక్షల 6 వేల మంది, బీహార్‌లో 2.1 లక్షల మంది, ఛత్తీస్ ‌గఢ్ ‌లో 1.86 లక్షలు, ఆంధ్రపదేశ్‌ లో 14 వేల 930 మంది క్వారంటైన్‌ లో ఉన్నట్లు తెలిపింది. ఇకపోతే , గతంలో క్వారంటైన్ సమయం 14 రోజులు ఉండగా ..ఇప్పుడు 7 రోజులకు కుదించారు.