Begin typing your search above and press return to search.

మోడీతో భేటీ తర్వాత కేసీఆర్ మూడ్ ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   6 Oct 2019 6:32 AM GMT
మోడీతో భేటీ తర్వాత కేసీఆర్ మూడ్ ఎలా ఉంది?
X
ప్రధాని మోడీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత. తొలిసారి ఆయనతో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైనం ఆసక్తికరంగా మారింది. మీడియాలో వచ్చిన రిపోర్టులకు. వాస్తవంగా జరిగిన దానికి సంబంధమే లేదంటున్నారు. ప్రధానితో దాదాపు 52 నిమిషాల పాటు ముఖాముఖి చర్చలు జరిగినట్లుగా.. భారీ వినతిపత్రాన్ని అందించినట్లుగా చెప్పటమే కాదు. తాము చెప్పిన విషయాల్ని మోడీ విన్నారని.. సానుకూలంగా రియాక్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే.. ఇలా వచ్చిన వార్తల్లో నిజం ఎంతమాత్రం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. భేటీ సందర్భంగా కేసీఆర్ తో మోడీ ఏం మాట్లాడారన్నది పక్కన పెడితే.. మీడియా రిపోర్టులలో మాదిరి 52 నిమిషాల పాటు ఇద్దరు ముఖ్యనేతల భేటీ సాగలేదంటున్నారు. అంతేకాదు. భేటీకి ముందు కాస్తంత హుషారుగా ఉన్న కేసీఆర్. మోడీని కలిసి వచ్చిన తర్వాత. కామ్ ఉన్నారని చెబుతున్నారు.

మోడీతో భేటీ కోసం ఒక్కడిగానే వెళ్లిన కేసీఆర్. తిరిగి వచ్చిన తర్వాత గంభీరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. ప్రదాని మోడీతో ఏకాంత సమావేశం అంత సానుకూల వాతావరణంలో జరిగినట్లుగా అనిపించట్లేదని.. కేసీఆర్ కు సన్నిహితంగా వ్యవహరించే గులాబీ నేత ఒకరు చెప్పటం కనిపించింది.

అంచనాకు భిన్నంగా ఏదో జరిగిందని.. మీటింగ్ పాజిటివ్ గా జరగలేదన్న విషయాన్ని మాత్రం బలంగా చెప్పగలమంటున్నారు. ఈ కారణంగానే. గతంలో పీఎంను కలిసి వచ్చిన తర్వాత. ఆయనకు తాను ఆ సలహా ఇచ్చినట్లు.. తాను చెప్పిన విషయాల్ని మోడీ శ్రద్ధగా విన్నారని గొప్పలు చెప్పుకుంటూ ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యేది. ఈసారి అలాంటివేమీ రిలీజ్ కాకపోవటం వెనుక ఇదే కారణం ఉండి ఉండొచ్చంటున్నారు.