Begin typing your search above and press return to search.

ఆంక్షలను రష్యా ఎలా తట్టుకుంటోంది ?

By:  Tupaki Desk   |   24 April 2022 6:31 AM GMT
ఆంక్షలను రష్యా ఎలా తట్టుకుంటోంది ?
X
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి సుమారు 50 రోజులవుతోంది. ఇన్ని రోజులుగా యుద్ధం చేస్తున్నా రష్యా గెలిచిందీ లేదు అలాగే ఉక్రెయిన్ ఓడిపోయిందీ లేదు. మరి గెలుపోటములు తేలకుండా ఎన్నిరోజులని యుద్ధం జరుగుతుంది ? అనేది పెద్ద ప్రశ్న. నిజానికి యుద్ధం ఎన్నిరోజులు జరిగినా అంతిమ విజయం రష్యాదే అనే వాదన బలంగా ఉంది. ఎందుకంటే రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చిట్టెలుక అన్న విషయం అందరికీ తెలిసిందే.

సరే యుద్ధంలో రష్యా గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కన పెట్టేస్తే రష్యాపై ఆంక్షలను విధించి ఒక చట్రంలో బిగించేయాలని అమెరికా నేతృత్వంలోని చాలా దేశాలు గట్టిగా డిసైడ్ చేసుకున్నాయి. అందుకనే రష్యాపై అనేక ఆంక్షలను విధించాయి. మామూలుగా అయితే ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం అన్ని రకాలుగా ఈపాటికి అల్లాడిపోవాలి. కానీ రష్యా అసలు ఆంక్షలను లెక్కేచేయటం లేదు.

ప్రపంచ దేశాలు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నా రష్యా ఎందుకని లెక్కచేయటం లేదు ? ఆంక్షల ప్రభావం రష్యాపై ఎందుకు పెద్దగా కనడటం లేదు ? ఎందుకంటే రష్యా చాలా ముందుజాగ్రత్తలు తీసుకుంది. యుద్ధం ప్రకటించగానే తనపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తాయని ఊహించింది. అందుకనే యుద్ధానికి చాలాకాలం ముందుగానే అందుకు అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. రష్యా నుండి గ్యాస్, చమురు కొనుగోలు చేయకూడదని అమెరికా, నాటో దేశాలు తీర్మానించాయి. అయితే అనధికారికంగా గ్యాస్, చమురు చాలా దేశాలు కొంటునే ఉన్నాయి.

ఇదే సమయంలో గతంలో ఎప్పుడూ లేనంతగా రష్యా నుంచి చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. అంటే వ్యాపారపరంగా రష్యాపై పెద్దగా ఆంక్షల ప్రభావం లేనట్లే. వ్యాపారపరంగా సమస్యలు లేనపుడు ఆర్ధికంగా మాత్రం సమస్యలు ఏముంటాయి ? రష్యా నుంచి గ్యాస్ కొనటం ఆపేస్తే నాటో దేశాల్లో పరిస్థితి తల్లకిందులైపోతుంది.

అందుకనే ఒకవైపు ఆంక్షలు విదించినా మరోవైపు అనధికారికంగా గ్యాస్ కొంటునే ఉన్నాయి. కాకపోతే యుద్ధం కారణంగా తమ దేశం నుండి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు వెళ్ళిపోవటాన్ని రష్యా ఊహించలేదు. దానికి కూడా విరుగుడు ఆలోచిస్తోంది. అందుకనే ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా తట్టుకుని నిలబడుతోంది.