Begin typing your search above and press return to search.

ట్రంప్ ఆరోగ్య పరిస్థితి పై అయోమయం?

By:  Tupaki Desk   |   4 Oct 2020 3:00 PM GMT
ట్రంప్ ఆరోగ్య పరిస్థితి పై అయోమయం?
X
అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతోంది. కరోనాను కట్టడి చేయలేక చేత్తులేత్తేస్తోంది. కరోనా కేసుల్లో అమెరికా తొలిస్థానంలో ఉండటం గమనార్హం. తాజాగా అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు ట్రంప్ అనుహ్యంగా కరోనా బారిన పడటంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

అమెరికాలో ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. 74 ఏళ్ల ట్రంప్ కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లనే వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన వ్యక్తిగత సహాయకురాలు కరోనా బారినపడింది. ఈ వయసులో కరోనాను ట్రంప్ ఎదుర్కొంటారా? లేదా అన్నది అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది.

ఈరోజు ట్రంప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ అమెరికన్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయనకు రెమ్ డిసివిర్ తోపాటు మరిన్ని యాంటీబాడీ ఔషధాల్ని వైద్యులు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి..రానున్న 48గంటలు ట్రంప్ కు కీలకంగా మారనున్నాయట. ట్రంప్ కరోనా బారిన 24 గంటల్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే ప్రచారం జరిగింది. ఆ వెంటనే ట్రంప్ ను వైట్ హౌజ్ వర్గాలు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించినట్లు తెలుస్తోంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై అయోమయం ఇప్పటికీ కొనసాగుతోంది. తన ఆరోగ్యం బాగుందని ట్రంప్ చెప్పినట్లు ఒక వీడియో తాజాగా విడుదలైంది. అయితే ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఆయన ఆరోగ్యంపై పలు మీడియా చానళ్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా కరోనా సోకిన సమయంతో పోలిస్తే ఇప్పుడు ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన ఫిజీషియన్ సిన్ కాన్లే తెలిపారు.