Begin typing your search above and press return to search.

శవాల కుప్పల నుంచి అమెరికా మాస్కులు తీసేంతలా మార్పు ఎలా సాధ్యమైంది?

By:  Tupaki Desk   |   2 May 2021 5:00 AM IST
శవాల కుప్పల నుంచి అమెరికా మాస్కులు తీసేంతలా మార్పు ఎలా సాధ్యమైంది?
X
పాలకులకు కమిట్ మెంట్ ఉండాలే కానీ ఏదీ అసాధ్యం కాదు. ఇందుకు ప్రపంచానికి పెద్దన్న అమెరికానే అతి పెద్ద ఎగ్జాంఫుల్. ఎందుకంటే.. ఈ అగ్రరాజ్యంలో కరోనా ఎంతటి దారుణ పరిస్థితుల్ని తీసుకొచ్చిందో తెలిసిందే. కరోనా బారిన పడి మరణించిన వారికి కనీసం అంతిమ సంస్కారాలకు సైతం జాగా లేకపోవటం.. అదే పనిగా పెరుగుతున్న మరణాలతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో శవాలు కుప్పలుగా పేరుకుపోవటం తెలిసిందే.

అలాంటి దేశంలో.. కొద్ది నెలల వ్యవధిలో సాధారణ పరిస్థితికి వెళ్లిపోవటమే కాదు.. ముఖానికి తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన మాస్కుల్ని ఈ రోజున పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే ప్రకటించటం గమనార్హం. మధ్యలో ఏమైంది? ఏం అద్భుతం జరిగి.. అమెరికా ఇవాళ ఇలాంటి పరిస్థితికి చేరుకుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం కరోనాకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. భౌతికదూరం.. ముఖానికి మాస్కుపెట్టుకోవటంతో పాటు.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రయారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు ప్రపంచ దేశాలకు భిన్నంగా అమెరికన్లు వ్యవహరించిన తీరు కూడా కేసుల పెరగటానికి కారణంగా చెప్పాలి. మాస్కు పెట్టుకోవటం ఎందుకని.. తమ జన్మహక్కుగా వచ్చిన స్వేచ్ఛను మాస్కుతో అడ్డకోవటాన్ని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేయటం.. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారటం తెలిసిందే.

అలాంటి అమెరికాలో ఈ రోజున మాస్కులు పెట్టుకోకుండానే వీధుల్లోకి వచ్చేయొచ్చన్న మాటనుబైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక విధంగా చెప్పాలంటే.. తాజా పరిస్థితికి సంబంధించిన క్రెడిట్ మొత్తం అధ్యక్షుడు బైడెన్ ఖాతాలో వేయాలని చెప్పక తప్పదు. ఎందుకంటే తాను పగ్గాలు చేప్టటిన నాటినుంచి వ్యాక్సినేషన్ కు.. కరోనా వ్యాక్తికి చెక్ పెట్టేందుకు చేయాల్సిన చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేయటమే కాదు.. వివిధ దేశాలకు అత్యవసర మందులకు అవసరమైన ముడి పదార్థాల్ని ఎగుమతులపై బ్యాన్ పెట్టటం..వ్యాక్సిన్ ఉత్పత్తి దేశం ఏదైనా.. ఆ దేశంలో వ్యాక్సిన్ వేస్తున్నారా? లేదా? లాంటివి పక్కన పెట్టి.. తమ దేశానికి పెద్ద ఎత్తున టీకా నిల్వల్ని పెట్టుకోవటం.. వ్యాక్సినేషన్ కు అర్హులైన వారికి తప్పనిసరిగా టీకా వేయటం అన్నది రూల్ గా పెట్టుకున్నారు. ఇలాంటి చర్యలే.. కరోనా నుంచి అమెరికాను విముక్తం చేయటంతో పాటు.. ఈ రోజు ముఖానికి మాస్కు లేకుండా వీధుల్లోకి వచ్చే అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు.మరి.. ఇలాంటి రోజు మన దేశంలో ఎప్పటికి వస్తుందో?