Begin typing your search above and press return to search.
జగన్ ను తిట్టిన ఆ మాజీ మంత్రికి పెండింగ్ బిల్స్ రూ.25 కోట్లు ఎలా మంజూరయ్యాయి?
By: Tupaki Desk | 11 Feb 2021 8:00 AM ISTవైఎస్ఆర్ కు నమ్మిన నాయకులు.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబం రెండు సార్లు కాంగ్రెస్ నుంచి.. ఒకసారి వైసీపీ నుంచి గెలిచిన తర్వాత 2016లో టీడీపీలోకి జంప్ అయ్యింది. చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఆదినారాయణరెడ్డిని లాగేసి ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టాడు. ఆ తర్వాత జమ్మలమడుగులో పెద్ద ఎత్తున కాంట్రాక్టులు దక్కించుకొని పనులు చేశాడట.... జగన్ పార్టీ నుంచి గెలిచి అదే జగన్ ను అసెంబ్లీలో అనరాని మాటలు అన్నాడు. నిండు సభలోనే జగన్ పై నోరు పారేసుకున్నాడు.
2019 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. దీంతో జమ్మలమడుగులో అడ్రస్ లేకుండా ఓడిపోయిన తర్వాత లోకల్ గా భయపడి బీజేపీ పంచన చేరాడని ఎవరిని అడిగినా చెప్తారని ఆ ప్రాంత వాసులు అంటున్నారు.
అయితే ఈ మధ్య జమ్మలమడుగులో ఎక్కడ చూసినా ఒక వైరల్ న్యూస్ ప్రతి ఇద్దరి నోట చూసినా ఇదే చర్చ జరుగుతోందట.. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి సోదరులు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు పట్టి పనులు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.25 కోట్లు బిల్స్ ఆగిపోయాయని.. ఈ మధ్య వాళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని సమాచారం.
వైసీపీకి చెందిన పెద్దాయన ఒక టాప్ లీడర్ తో సెట్ చేసుకోని ఆదినారాయణరెడ్డికి రావాల్సిన బిల్స్ లో 30 శాతం సెటిల్ మెంట్ చేసుకున్నాడని జమ్మలమడుగులో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై వైసీపీ నేతలు లబోదిబోమంటున్నారట.. తాము 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి మేము చేసిన పనులకు ఇప్పటికీ బిల్స్ రావడం లేదని వైసీపీ వర్గాలు వాపోతున్నాయట.. ఇదే ఇప్పుడు జమ్మలమడుగులో కోడై కూస్తున్నారట.. ఆ నోటా ఈ నోట ఇది సోషల్ మీడియాలో పాకుతోందట.. ఇది వైరల్ న్యూసా? రియల్ న్యూసా అనేది కరెక్ట్ గా తెలియకపోయినా లోకల్ గా మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందట.. చూద్దాం ఇది రియల్ న్యూసా? ఫేక్ అనేది త్వరలోనే బయటపడే అవకాశం ఉంది