Begin typing your search above and press return to search.

పోర్న్ స్టార్ అంపైర్ ఎలా అయ్యాడు?

By:  Tupaki Desk   |   9 Nov 2019 9:16 AM GMT
పోర్న్ స్టార్ అంపైర్ ఎలా అయ్యాడు?
X
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారిని చాలా మందిని చూసుంటాం.. కానీ ఒక ప్రముఖ పోర్న్ స్టార్ క్రికెట్ లో అంపైర్ అయిన ఘటన తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ లో చోటు చేసుకుంది.

ఇంగ్లండ్ ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం లో పర్యటిస్తోంది. మొత్తం 5 టీట్వంటీల సిరీస్ ఆడుతోంది. న్యూజిలాండ్ , ఇంగ్లండ్ చెరో రెండు విజయాల తో సమానంగా ఉన్నాయి. ఈ ఆదివారం ఐదో టీట్వంటీ తో సిరీస్ ఎవరిదో తేలనుంది.

అయితే ఈ టీట్వంటీ మ్యాచ్ లకు నాలుగో ఎంఫైర్ గా వ్యవహరిస్తున్న న్యూజిలాండ్ కు చెందిన గార్త్ స్టిరాట్ (51) గురించి న్యూజిలాండ్ క్రికెటర్లు అంతా కథలు కథలుగా చెబుతుండడం విశేషం. గార్త్ స్టిరాట్ జెంటిల్మెన్ గేమ్ లో అంపైర్ కాకముందు న్యూజిలాండ్ లో ఓ ప్రముఖ పోర్న్ స్టార్ కావడం గమనార్హం. ఇతడి నగ్న చిత్రాలు ఓ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యాయి. ఇతడీ నీలి చిత్రాలు కూడా న్యూజిలాండ్ లో పాపులరే..

పదేళ్ల క్రితం న్యూజిలాండ్ గోల్ఫ్ అసోసియేషన్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టిరాట్ పనిచేశాడు. అప్పుడే పోర్న్ స్టార్ గా పలు నీలి చిత్రాల్లో నటించాడు. అయితే రహస్యంగా చేసిన పని లీక్ అయ్యింది. దీంతో గోల్ఫ్ అసోసియేషన్ పదవి కోల్పోయాడు.

తాజాగా జెంటిల్మెన్ గేమ్ లో అంపైర్ అవతారం ఎత్తాడు. దీన్ని ప్రొఫెషనల్ గా తీసుకొని రాణిస్తున్నాడు. మహిళల క్రికెట్ తోపాటు పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు స్టిరాట్ ఎంపైర్ గా ప్రస్తుతం రాణిస్తున్నాడు. శుక్రవారం జరిగిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ టీట్వంటి మ్యాచ్ కు నాలుగో అంపైర్ గా చేయడంతో ఇతడి గురించి విషయం బయటకు పొక్కింది.