Begin typing your search above and press return to search.

అయోధ్యలో కట్టే మసీదు ఎలా ఉండనుందంటే?

By:  Tupaki Desk   |   20 Dec 2020 11:45 AM IST
అయోధ్యలో కట్టే మసీదు ఎలా ఉండనుందంటే?
X
అన్ని మతాల్ని సమానంగా గౌరవించే విలక్షణ భారతదేశ సొంతం. అలాంటి దేశంలో అయోధ్య లాంటి పుణ్యక్షేత్రంలో నిర్మిస్తున్న మసీదుకు సంబంధించిన డిజైన్ బయటకు వచ్చింది. దీన్ని చూసినంతనే కళ్లు చెదిరిపోయేలా ఉండటమే కాదు.. వావ్ అన్న మాట మతాలకు అతీతంగా రావటం ఖాయం. వచ్చే ఏడాదిలో శంకుస్థాపన చేసి.. మొదటిదశలో మసీదు.. ఆసుపత్రి నిర్మాణం చేస్తారు. రెండో దశలో ఆసుపత్రిని పెద్ద ఎత్తున విస్తరించే ప్రణాళిక ఉంది.

ఈ మసీదు నిర్మాణం కోసం.. ప్రపంచ వ్యాప్తంగా పలు మసీదుల డిజైన్లను పరిశీలించిన మేరకు.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ వెల్లడించింది. అయోధ్య పట్టణానికి 18కిలోమీటర్లదూరంలో లక్నో హైవే మీద ఉన్న ధానీపూర్ లో ఐదు ఎకరాల స్థలాన్నియోగి సర్కారు కేటాయించింది. అయోధ్యలోని వివాదాస్పద కట్టడానికి సంబంధించి గత ఏడాది నవంబరులో తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే.

వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనటం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించటం తెలిసిందే. యోగి సర్కారు ఇచ్చిన స్థలాన్ని ఓకే చేసిన సున్నీ వక్ఫ్ బోర్డు.. మసీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్ ట్రస్టును ఏర్పాటు చేసింది. తాజాగా మసీదుకు సంబంధించిన డిజైన్లను విడుదల చేశారు. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ డిజైన్లు పలువురి నోట వావ్ అనేలా చేస్తున్నాయి.