Begin typing your search above and press return to search.
గన్నవరంలో వంశీ పరిస్థితి ఇంత దారుణమా?
By: Tupaki Desk | 16 Sept 2020 10:45 AM ISTగన్నవరంలో నిర్వహించిన ఓ తాజా సర్వేలో ఒకటి మాత్రం స్పష్టమైందట.. వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరూ కూడా వైసీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుక లేరని తేలిపోయిందట.. మరి వంశీతో టీడీపీ వాళ్లు వైసీపీలోకి వచ్చారా? అంటే అదీ లేదని తేలిందట.. దీంతో ఉప ఎన్నికలు వస్తే వంశీ పరిస్థితి దారుణంగా ఉండబోతోందని ఓ సర్వేలో తేలిందట.. ఇప్పుడు ఆ సర్వే విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట..
ఒకప్పుడు గన్నవరం అంటే టీడీపీ అని.. ఎవరిని అడిగినా చెప్తారు. టీడీపీ హవా ప్రతీసారి గన్నవరంలో ఉంటుంది. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ జెండానే ఎగిరింది. అయితే గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచిన తరువాత అతడి వ్యక్తిగత కారణాలతో వైసీపీకి జై కొట్టాడన్న ప్రచారం ఉంది.
అయితే ఇటీవల చేసిన ఒక సర్వేలో గన్నవరంలో వైసీపీ తరుఫున వంశీ నిలబడితే.. ఆయనకు పోటీగా టీడీపీ తరుఫున ఎవరు నిలబడినా టీడీపీకే 54శాతం ఓట్లు వస్తాయని తేలిందట.. ఎందుకంటే వంశీకి వేస్తే ఇప్పుడు మమ్మలను ముంచిపోయాడని.. అతడి స్వార్థం కోసం పార్టీ మారాడని జనాలు అభిప్రాయపడుతున్నారట..
అదేవిధంగా రియల్ వైసీపీ నాయకులు అయిన దుట్టా రామచంద్రారావు వైఎస్ఆర్ కుటుంబం కి దగ్గరివారు.. ఆయన మనషులు కూడా మాకు అభిమానం ఉన్నా కూడా వంశీని ఓడగొడుతాం అని స్పష్టం చేస్తున్నారట....ఇక మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన వెంకట్ రావు మనుషులు కూడా అదే విధంగా చెప్తున్నారట..
గన్నవరంలో వైసీపీ మీద అభిమానం ఉన్నా కూడా.. తాము అంతా వంశీ మీద వ్యతిరేకతతో ఉన్నాం అని సర్వేలో నిగ్గుతేలిందట.. 3200 శాంపిల్స్ చేశారంట.. దానిలో టీడీపీ నుంచి క్యాండిడేట్ ఎవరైనా సరే.. టీడీపీకే ఓటు వేస్తాం అని ఏకంగా 54శాతం మంది చెప్పారంటే వంశీ మీద ఎంత వ్యతిరేకత నియోజకవర్గంలో ఉందో చెప్పకనే చెప్తోందని పలువురు అంటున్నారు.
చూద్దాం మరి ఉప ఎన్నికలు వస్తాయో లేక వంశీ రాజీనామా చేస్తా.. ఉప ఎన్నికలకు వెళ్లానంటూ మీడియాతో కాకి కబుర్లు చెప్తారో అని పలువురు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే సర్వే టాపిక్ ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఆ నోటా ఈ నోటా బయటపడింది.