Begin typing your search above and press return to search.
11 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి?
By: Tupaki Desk | 11 Nov 2020 8:45 AM ISTబిహార్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు.. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు వచ్చేశాయి. అయితే.. ఈ ఫలితాలు పెద్దగా ఫోకస్ కాలేదు. కారణం.. ఓవైపు బిహార్ రాష్ట్ర ఎన్నికలు.. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికగా చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు ఎన్నికల ఫలితాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేయటంతో.. మిగిలిన రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాల్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశ వ్యాప్తంగా జరిగిన 59 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ స్థానాల్ని బీజేపీనే సొంతం చేసుకోవటం గమనార్హం. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. మధ్యప్రదేశ్ లో జరిగిన 28 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాల్ని బీజేపీ సొంతం చేసుకోగా.. గుజరాత్ లో జరిగిన 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోక్లీన్ స్వీప్ చేసింది. యూపీలో జరిగిన ఏడు స్థానాల్లో బీజేపీనే గెలవగా.. ఒక స్థానాన్ని మాత్రం సమాజ్ వాదీ పార్టీ సొంతం చేసుకుంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆత్యాచారం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని.. ప్రస్తుతం జైల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాన్ని సైతం బీజేపీనే తిరిగి కైవసం చేసుకోవటం గమనార్హం. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. హర్యానాలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. జార్ఖండ్ లో జరిగిన రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా.. ఒకటి కాంగ్రెస్.. మరొకటి జేఎంఎం గెలిచాయి. కర్ణాటకలో జరిగిన రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీనే కైవశం చేసుకుంది.
మణిపూర్ లోని ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ విజయం సాధిస్తే.. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. నాగాలాండ్ లో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా.. ఒక స్థానంలో ఇండిపెండెంట్.. మరో స్థానంలో ఎన్ డీపీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒడిశాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ అధికార బిజూ జనతాదళ్ విజయం సాధించింది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం ఎవరిదో అందరికి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ విజయం సాధించటం సంచలనంగా మారింది.