Begin typing your search above and press return to search.

ములాయం లైఫ్ లో ఆమె ఎంట్రీ ఇంటరెస్టింగ్...?

By:  Tupaki Desk   |   10 Oct 2022 3:30 PM GMT
ములాయం లైఫ్ లో ఆమె ఎంట్రీ ఇంటరెస్టింగ్...?
X
ములాయం సింగ్ యాదవ్ బిజీ పొలిటీషియన్. ఆయన రాజకీయాల్లోని ప్రవేశించిందే ఓటమి ఎరగని 27 ఏళ్ళ యువకునిగా. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేశంలో 1975 టైమ్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు కూడా ములాయం ని ధీటైన నేతగా మార్చాయి. ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఇదిలా ఉంటే ములాయం సింగ్ యాదవ్ కి చిన్న వయసులోనే ఒక వివాహం జరిగింది. ఆయన మొదటి భార్యకు అఖిలేష్ యాదవ్ జన్మించారు.

అయితే ములాయం యూపీ సీఎం అయ్యాక మరోసారి ప్రేమ పెళ్ళి మధ్యన నలిగారు. అప్పటికి ఆయనకు దాదాపుగా యాభై ఏళ్ల వయసు ఉండొచ్చు. ఆయన సైతం యూపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అలాంటి టైం లో ఆయన సాధనా గుప్తా అనే ఒకామెను ప్రేమిచారు. ఆమె ఆకర్షణలో పడి చివరికి పెళ్ళి దాకా అడుగులు వేశారు.

అయితే ములాయం తల్లి ఆసుపత్రిలో ఉన్నపుడు ఆమె వైద్యం విషయంలో సాధనా గుప్తా చాలా శ్రద్ధగా చూసుకున్నారని, నర్స్ పొరపాటున ఒక ఇంజెక్షన్ ని బదులు మరొక‌టి ఇచ్చేయబోతుంటే ఆపి ములాయం తల్లి ప్రాణాలను కాపాడారని అఖిలేష్ యాదవ్ తన బయోగ్రఫీలో రాసుకొచ్చారు.

ఆ మీదట సాధనాగుప్తా మీద కృతజ్ఞతతో కూడిన ప్రేమను చూపించిన ములాయం ఆమెను పెళ్ళాడారు. నిజానికి వీరిద్దరి మధ్యన వయసు తేడా ఇరవై ఏళ్ళుగా చెబుతారు. ఇక వీరికి ప్రతీక్ యాదవ్ అనే కుమారుడు ఉన్నారు. ఇక ములాయం యాదవ్ కుమారుడిగానే ప్రతీక్ యాదవ్ స్కూల్ రికార్డుల్లో పేరు ఉండడం విశేషం.

అయితే దాదాపు పదిహేడేళ్ళ పాటు ఈ రెండవ వివాహాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ములాయం నెట్టుకొచ్చారు. అయితే 2007లో తన ఆదాయానికి సంబంధించి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో తన రెండో భార్యగా సాధనా గుప్తా పేరును అక్కడ ప్రస్తావించారు.

అలా బయట ప్రపంచం అంతా ములాయం రెండవ పెళ్ళి గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ తింది. ఇదిలా ఉంటే ములాయం మొదటి భార్య మాలతీ దేవి 2003లో చనిపోయారు. ఇక ఇదే ఏడాది జూలైలో సాధనాగుప్తా కూడా మరణించడం విశేషం. ఆమె గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో మరణిస్తే ఇప్పుడు అదే ఆసుపత్రిలో ములాయం సింగ్ యాదవ్ కూడా చనిపోవడం నిజంగా విశేషమే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.