Begin typing your search above and press return to search.
ఏడాదిలో హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాల లెక్క తెలిస్తే సర్ ప్రైజ్
By: Tupaki Desk | 4 Jan 2022 6:00 AM ISTదేశంలో మరెక్కడా లేని రీతిలో ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్ మహానగరంలో అంతకంతకూ ఎక్కువ అయిపోతున్నాయి. కరోనా.. నాన్ కరోనా అన్న తేడా లేకుండా మిగిలిన మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ అందరికి గమ్యస్థానంగా మారుతోందా? అంటే అవుననే చెబుతున్నారు.తాజాగా స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ 'అనరాక్' తాజా నివేదికలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. ఇళ్ల అమ్మకాల వృద్ధి రేటు మిగిలిన మహానగరాల కంటే ఎక్కువగా ఉండటం ఒక ఎత్తు..కొత్త ఇళ్ల నిర్మాణాల వృద్ధి రేటు బాగుండటం మరో ఎత్తుగా చెప్పాలి.
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, కోల్ కతా) ఇళ్ల అమ్మకాల్లో 39 శాతం ఏడాది చివరి మూడు నెలలు అయిన అక్టోబరు- డిసెంబరు మధ్యలోనే జరగటం గమనార్హం. కోవిడ్ కంటే ముందు మార్కెట్ ఇంకా రానప్పటికీ.. కోవిడ్ టైంతో పోలిస్తే మాత్రం అమ్మకాల రేటు బాగా పెరిగింది. భూములు.. ముడి పదార్థాల రేటు ఎక్కువగా ఉండటంతో ఇళ్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
2020లో దేశంలో అత్యధిక ఇళ్ల అమ్మకాలు జరిగిన నగరాల్లో మొదటి స్థానం ముంబయి అయితే.. రెండో స్థానంలో బెంగళూరు.. మూడు.. నాలుగు స్థానాల్లో పుణె.. ఢిల్లీ ఉన్నాయి. 2021 విషయానికి వస్తే మొదటి మూడుస్థానాల్లో ముంబయి.. ఢిల్లీ.. ఫుణె నగరాలు నిలిచాయి. కాకుంటే.. 2020తో పోలిస్తే 2021లో అమ్మకాల విషయంలో హైదరాబాద్ అందరి కంటే మిన్నగా నిలచింది. 2020లో ముంబయిలో 44,320 ఇళ్ల అమ్మకాలు సాగితే.. 2021లో 76,400 ఉన్నాయి. అయితే.. హైదరాబాద్ విషయానికి వస్తే 2020లో కేవలం 8560 ఇళ్ల అమ్మకాలు జరిగితే.. 2021లో ఏకంగా 25,410 ఇళ్ల అమ్మకాలు.. అంటే దగ్గర దగ్గర మూడు రెట్లు ఎక్కువగా అమ్ముడు కావటం గమనార్హం.
కొత్త ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన వాటికి సంబంధించిన లెక్కలు చూస్తే.. దేశంలో అత్యధికంగా ముంబయి మహానగరం నిలిచింది. 2020లో 30,290 ఇళ్లు మొదలైతే.. 2021లో 56,880 మొదలయ్యాయి. అదే హైదరాబాద్ విషయాన్ని చూస్తే.. 2020లో 21,110 ఇళ్లు మొదలైతే.. 2021లో 51,470 ఇళ్లు మొదలయ్యాయి. ఇది కూడా దగ్గర దగ్గర మూడు రెట్లు కావటం గమనార్హం. ముంబయితో పోలిస్తే హైదరాబాద్ జోరు తక్కువగా కనిపించొచ్చు. కానీ.. వృద్ధి రేటు చూస్తే.. హైదరాబాద్ ముందు మంబయి వెలవెలబోవటం ఖాయం.
ఇంతకీ.. హైదరాబాద్ ఎందుకింతలా ఆకర్షిస్తోందంటే.. దేశం మధ్యలో ఉండటం.. వాతావరణ పరిస్థితులు మిగిలిన నగరాల కంటే మెరుగ్గా ఉండటం.. ఇక్కడ భాషాపరమైన సమస్యలు లేకపోవటం.. చాలా వేగంగా వృద్ధి చెందుతున్న మహానగరం కావటం.. స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాటు.. జీవనశైలి మెరుగ్గా ఉండటం.. కాస్మోపాలిటన్ జీవితానికి దగ్గరగా ఉండటంతో పాటు.. ఎవరికి ఎలాంటి జీవితం కావాలో అలాంటి జీవితం దొరికే వీలు ఉండటం. వీటితో పాటు..ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం. వెరసి.. హైదరాబాద్ మహానగరం మెరిసిపోతోంది.