Begin typing your search above and press return to search.

రూ.12లకే అద్భుతమైన ఇల్లు.. 17 మంది మాత్రమే కొన్నారు

By:  Tupaki Desk   |   20 Jun 2021 4:12 AM GMT
రూ.12లకే అద్భుతమైన ఇల్లు.. 17 మంది మాత్రమే కొన్నారు
X
అవును.. అక్షరాల 12 రూపాయిలు. దానికే లగ్జరీ ఇల్లు వచ్చేస్తుందక్కడ. ఈ మాట విన్నంతనే ఆశ్చర్యం కలుగుతుందా? నమ్మబుద్ధి కావటం లేదా? అంటే అవుననే చెబుతారు. ఆ మాటకు వస్తే.. ఇవాల్టి రోజున సింగిల్ ఇడ్లీనే రూ.15. అలాంటిది విలాసవంతమైన ఇండిపెండెంట్ హౌస్ కేవలం రూ.12 లకు ఎక్కడ దొరుకుతుంది? కాస్త కష్టమైనా సరే.. ఏదోలా ఆ ఇంటిని సొంతం చేసుకుంటామని అనుకుంటున్నారా? అయితే.. మీరు క్రోయేషియా వెళ్లాలి.

రూ.12కే ఇల్లేంటి? క్రోయేషియా ఏమిటి? అంటారా? కాస్త సావధానంగా చదవండి.. విషయమంతా అర్థమవుతుంది. క్రోయేషియాలోని లెగ్రాడ్ అనే పట్టణం ఉంది. అక్కడి స్థానిక ప్రభుత్వం రూ.12కే విలాసవంతమైన ఇంటిని అమ్ముతోంది. కారణం.. ఆ పట్టణంలోని ప్రజలు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఆ చిన్న పట్టణాన్ని వదిలేసి.. పెద్ద నగరాలకు వెళ్లిపోతున్న వేళ.. లెగ్రాడ్ పట్టణం వెలవెలబోతోంది. దీంతో.. గడిచిన వందేళ్లుగా ఆ పట్టణంలో జనాభా తగ్గటమే కానీ పెరగని పరిస్థితి. ఇలాంటివేళ.. స్థానిక ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది.

తమ పట్టణంలోని విలాసవంతమైన ఇంటిని కేవలం రూ.12లకు అమ్మటమే కాదు.. రిపేర్ల కోసం మరో రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అయితే.. అక్కడ ఇంటిని కొనుగోలు చేసే వారు కొన్ని నిబంధనల్ని పక్కాగా పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఇంటిని కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా ఆ ఇంట్లోనే ఉండాలి. వారి వయసు 40 ఏళ్ల లోపు వారై ఉండాలి. అంతేకాదు.. లెగ్రాడ్ లో కనీసం పదిహేనేళ్లు నివసిస్తామని హామీ పత్రం రాసివ్వాలి. ఈ షరతులకు ఓకే అంటే తప్పించి.. ఇంటిని అమ్మరు. ఈ రూల్స్ కారణంగానే ఆ పట్టణంలో కారుచౌకకు ఇంటిని అమ్ముతానని చెప్పినా.. కేవలం 17 ఇళ్లను మాత్రమే అమ్మగలిగారు.