Begin typing your search above and press return to search.

పార్కింగ్ లో ఏదైనా జరిగితే నిర్వాహకుడితే బాధ్యతంతా!

By:  Tupaki Desk   |   17 Nov 2019 5:18 AM GMT
పార్కింగ్ లో ఏదైనా జరిగితే నిర్వాహకుడితే బాధ్యతంతా!
X
గంటల చొప్పున పార్కింగ్ ఫీజు వసూలు చేసే నిర్వాహకులు.. ప్రతిచోటా ఒక బోర్డును పెద్ద ఎత్తున పెడుతుంటారు. తమ వద్ద పార్కింగ్ లో ఉంచే వాహనాలు చోరీ అయినా.. డ్యామేజ్ జరిగినా తమకు సంబంధం లేదని పేర్కొటారు. డబ్బులు తీసుకొని మరీ బాధ్యత లేదని ఎలా అంటారన్న సందేహం వచ్చినా.. దానికి సమాధానం చెప్పే వారే కనిపించరు.

ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. వాహనాల పార్కింగ్ కు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు.. వాటికి జరిగే డ్యామేజ్ కు సదరు పార్కింగ్ నిర్వాహకుడిదే బాధ్యత అంతా అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. వాహనానికి ఏదైనా జరిగితే దాని యజమానిదే బాధ్యత అని బోర్డు పెట్టి పార్కింగ్ నిర్వాహకుడు తప్పించుకోలేరని స్పష్టం చేసింది.

జస్టిస్ మోహన్ ఎం. శాంతన గౌడర్, జస్టిస్ అజయ్ రస్తోగీలు తాజ్ మహల్ హోటల్ వర్సెస్ యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1998 ఆగస్టు ఒకటో తేదీన ఢిల్లీలో జరిగిన మారుతీ జెన్ కారు చోరీ కేసులో బాధ్యత హోటల్ దేనని చెప్పిన జాతీయ వినియోదారుల ఫోరం బాధితుడికి 12 శాతం వడ్డీతో రూ.2.80లక్షల పరిహారం.. న్యాయ వివాదాల ఖర్చు కింద రూ.50వేలు ఇవ్వాలని తీర్పును ఇచ్చింది.

అయితే.. ఆ తీర్పును అమలు చేయకుండా హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టుకు ఆశ్రయించగా.. జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తాజాగా అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. దీంతో.. పార్కింగ్ లో వాహనానికి జరిగే డ్యామేజీకి సదరు పార్కింగ్ స్లాట్ నిర్వాహకుడిదే బాధ్యతన్న విషయంపై సుప్రీంకోర్టు పూర్తి క్లారిటీ ఇచ్చిందని చెప్పకతప్పదు.