Begin typing your search above and press return to search.

భారత్ ను కలవర పెడుతున్న వేడిగాలులు.. వరల్డ్ బ్యాంక్ వార్నింగ్..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 8:53 AM IST
భారత్ ను కలవర పెడుతున్న వేడిగాలులు.. వరల్డ్ బ్యాంక్ వార్నింగ్..!
X
రాబోయే రోజుల్లో భారత్ లో మరింత వేడిగాలులు పెరుగుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో వేలాది మంది మృత్యువు కారణమైన వేడి తరంగాలు ఫ్రీక్వెన్సీ కొంతకాలంగా భారీగా పెరుగుతుందని పేర్కొంది. దీని వల్ల మానవ మనుగడ కష్టంగా మారనుందని వెల్లడించారు.

ఈ జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 'భారతదేశం శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు' పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను తయారు చేసింది. ఇందులో అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోబోతున్న దేశాల్లో భారత్ ముందుందని పేర్కొంది.

ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుంచే భారత్ లో వేడి గాలుల ప్రభావం మొదలైందని తెలిపింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 46 డిగ్రీల సెల్సీయస్ లేదా 114 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు చేరుకుందని వెల్లడించింది. మార్చిలోనూ అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. మున్ముందు దేశం మరింత అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోనుందని తెలిపింది.

ఈ వేడి గాలులు మానవ మనుగడను పరిమితం చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. దక్షిణాసియా వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చాలాకాలంగా పెరుగుతున్న వేడిగాలులకు మరింత ఊతాన్ని ఇస్తున్నాయని పేర్కొంది. రాబోయో దశాబ్ద కాలంలో భారత ఉపఖండం మరింత తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కోనుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆరవ అసైన్మెంట్ పేర్కొంది.

2036-65 నాటికి కార్బన ఉద్గారాల కారణంగా భారత్ లో వేడి తరంగాలు 25 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని జీ 20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ 2021లోనే హెచ్చరించింది. దీని ప్రభావం వేడి ఆర్థిక ఉత్పాదక రంగాలకు దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం భారత్ లోని శ్రామిక శక్తిలో 75 శాతం ప్రజలు వేడి-బహిర్గత ఉపాధిపై ఆధారపడుతున్నారు.

2030 నాటికి 80 మిలియన్ల ప్రపంచ ఉద్యోగాల్లో భారత్ 34 మిలియన్లను కలిగి ఉండవచ్చని పేర్కొంది. అయితే ఉష్ణ ఒత్తిడి కారణంగా ఉత్పాదకత క్షీణించి నష్టాలు కలగవచ్చని పేర్కొంది. ఉష్ణోగ్రతలు ఇలానే పెరుగుతూ పోతే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భారత్ లో కేవలం 8 శాతం కుటుంబాలు మాత్రమే ఏసీలను ఉపయోగించే స్థితిలో ఉన్నారని అంచనా.

మిగిలిన కోట్లాది మంది ప్రజలు ఏసీలను కొనుగోలు చేసే స్థితిలో లేరని పేర్కొంది. ఉష్ణోగ్రతల కారణంగా కోట్లాది కుటుంబాలు తీవ్రమైన వేడికి గురి కావాల్సి ఉంటుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆరవ అసైన్మెంట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అందుబాటులో ఉండే వనరులతో ఎండ తీవ్రతను నియంత్రించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.