Begin typing your search above and press return to search.

డైపర్లు వేసుకొని డ్యూటీ చేస్తున్న డాక్టర్లు..

By:  Tupaki Desk   |   13 Feb 2020 4:30 PM GMT
డైపర్లు వేసుకొని డ్యూటీ చేస్తున్న డాక్టర్లు..
X
కరోనా అలియాస్ కొవిడ్ కారణంగా ప్రపంచమంతా ఎంత ఆందోళనకు గురి అవుతుందో తెలిసిందే. కొద్ది రోజుల క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతానికి ఈ వైరస్ విస్తరణను మిగిలిన దేశాల్లో కంట్రోల్ చేసినప్పటికీ.. చైనాలో మాత్రం దీని తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. రోజు గడిచేసరికి పలు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. చైనా ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంది. ఇప్పటికే కొవిడ్ కారణంగా చైనా బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినటమే కాదు.. ఆర్థిక వ్యవస్థకు సైతం భారీ దెబ్బ తగిలినట్లుగా చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. కొవిడ్ ను ఎప్పటికి కంట్రోల్ చేస్తామన్న విషయంలోనూ క్లారిటీ రావటం లేదు. అంతో ఇంతో వాతావరణ పరిస్థితులు మార్పు వచ్చి.. మండే ఎండలతో కొంత ఉపశమనం కలుగుతుందని బావిస్తున్నారు. మరోవైపు.. దీనికి వ్యాక్సిన్ ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో చైనా వైద్యులకు ఊపిరిసలపనంత పనితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

వెల్లువలా వస్తున్న రోగులకు ట్రీట్ మెంట్ ఇవ్వటం.. వారి కారణంగా తమకు వైరస్ అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి.. పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. చైనా వైద్యులకు ఎంత పని ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా ఒక ఉదాహరణతో చెప్పేయొచ్చంటున్నారు. కొవిడ్ కేసులను డీల్ చేస్తున్న వైద్యులు.. యూరినస్ కోసం కూడా బాత్రూంకు వెళ్లలేని పరిస్థితి నెలకొందట.

దీంతో.. బాత్రూం సమస్యను డైపర్లతో అధిగమిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంత తీవ్రమైన ఒత్తిడితో పని చేస్తున్న వైద్యుల ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది అర్థం కావటం లేదు. తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా శ్రమిస్తున్న చైనా వైద్యుల్ని అభినందించాల్సిందే.