Begin typing your search above and press return to search.
మాస్కు లేకుండా బయటకొస్తే హాంకాంగ్ లో షాకింగ్ ఫైన్
By: Tupaki Desk | 17 July 2020 10:15 AM ISTప్రపంచం మొత్తం కరోనాతో కకావికలమవుతున్న వేళ.. అదేమీ పట్టించుకోకుండా వ్యవహరించిన దేశాలు కొన్ని ఉన్నాయి. తామెంత తప్పు చేశామన్న విషయాన్ని ఇప్పుడు గుర్తిస్తున్న ఆయా దేశాలు.. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయమే కాదు.. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి పరిస్థితి హాంకాంగ్ లో నెలకొంది. కరోనా పాజిటివ్ కేసులు చుట్టుపక్కల దేశాల్లో ఎక్కువ అవుతున్నా.. పెద్దగా పట్టని ఆ దేశంలో ఇప్పుడు పాజిటివ్ కేసులు పెరిగాయి.
దీంతో.. కఠిన లాక్ డౌన్ చర్యల్ని ఆ దేశం చేపట్టింది. అన్నింటిని మూసేయటమే కాదు.. రోడ్డు మీద నలుగురు కలిసి ఉండటంపైనా పరిమితులు విధించింది. అంతేనా.. మాస్కు లేకుండా బయటకు వచ్చే వారికి ఏకంగా రూ.48వేలు జరిమానా విధించేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా అమలు చేస్తున్న కఠిన నిర్ణయాలతో పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆసియా పసిఫిక్ దేశాల్లో వైరస్ ఏ రూపంలో వ్యాప్తిస్తుందో ఒక పట్టాన అర్థం కావట్లేదట. చాలా దేశాల్లో వైరస్ తో బాధ పడుతున్న వారిని విచారించిన తర్వాత కూడా వారి కాంట్రాక్టు ఎక్కడన్న విషయాన్ని గుర్తించలేక తలలు పట్టుకుంటున్నారట. దీంతో..వ్యాధి నివారణ కష్టంగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పుడీ తరహా కేసులు దక్షిణ కొరియా.. జపాన్.. హాంగ్ కాంగ్.. ఆస్ట్రేలియా లాంటిదేశాల్లో చూడొచ్చని చెబుతున్నారు.
ప్రపంచానికి పెద్దన్న అమెరికా విషయానికి వస్తే.. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో రూ.75,800 పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం. ఆరిజోనా.. టెక్సాస్.. ఫ్లోరిడా రాష్ట్రాల్లోనే పాతిక వేల కేసులు నమోదైనట్లు గుర్తించారు. పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టేందుకు అమెరికాలోని 22 రాష్ట్రాలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ప్రకారం తమ రాష్ట్రంలోకి ప్రవేశించే వారెవరైనా పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించారు. ఎవరెన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటాన్ని ప్రపంచంలోని పలు దేశాలు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నాయి.