Begin typing your search above and press return to search.

హనీ ట్రాప్: ఫోన్లో వలపు వల..ఇంటికి పిలిపించి రూమ్ లోకి తీసుకెళ్లి !

By:  Tupaki Desk   |   24 Aug 2021 6:36 AM GMT
హనీ ట్రాప్: ఫోన్లో వలపు వల..ఇంటికి పిలిపించి రూమ్ లోకి తీసుకెళ్లి !
X
తెలుగు రాష్ట్రాల్లో హనీ ట్రాప్ గ్యాంగ్‌ ల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో అర్ధనగ్న ఫొటోలు అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మహిళలతో చనువుగా ఫోన్ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల మోసాలు పెరగడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. ఈ గ్యాంగ్ 20 రోజుల్లో ఇద్దరిని మోసం చేసి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు. ఐదుగురు సభ్యుల గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో బంగారు పేటకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ఈ గ్యాంగ్ మహిళల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా.. ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫొటోలు తీస్తున్నారు. వీటిని అడ్డంపెట్టుకుని డబ్బు కోసం బెదిరిస్తున్నారు. వెల్లడించారు. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో అనగానే అవతలి వైపు నుంచి అమ్మాయి గొంతు వినిపించింది. మీరు నాకు బాగా తెలుసు.. చాలా సార్లు మాట్లాడాలని ప్రయత్నించినా కుదర్లేదు. మీరు అందంగా ఉంటారు. తెలిసినవాళ్ల దగ్గర మీ ఫోన్ నెంబర్ సంపాదించా.. ఓసారి ఇంటికి వస్తే ఏకాంతంగా మాట్లాడుకుందాం అని ఇంటికి పిలిపించుకుంది. ఇంటికెళ్లిన తర్వాత తియ్యగా మాట్లాడి గదిలోకి తీసుకెళ్లిన అమ్మాయి, అతడ్ని అర్ధనగ్నంగా ఉండగా ఫోటోలు తీసింది.

దీంతో అసలు కథ మొదలైంది. ఫోటోలను అడ్డు పెట్టుకుని ఓ గ్యాంగ్ ఎంటర్ అయ్యింది. సదరు యువకుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ అందినకాడికి దండుకున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లా పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో యువకులు మోస పోయినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా స్కెచ్ వేసిన పోలీసులు దోపిడీ ముఠాకు చెక్ పెట్టారు.

కర్నూలు నగరంలో హనీ ట్రాప్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలతో చనువుగా ఫోన్ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న వ్యవహారానికి పోలీసులు చెక్ పెట్టారు. ఐదుగురు సభ్యులు కలిగిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన 2 ప్రాంసరి నోట్లు, రూ.4 లక్షలు విలువైన 2 చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి వారి ట్రాప్ లో పడొద్దని.. కొత్త నెంబర్ల నుంచి కాల్ చేసి తియ్యగా మాట్లాడితే మోసపోవడం గ్యారెంటీ అని పోలీసులు హెచ్చరించారు.