Begin typing your search above and press return to search.
హత్యకేసుః పోలీసులు అబద్ధం చెప్పారు.. నిందితులు నిజం చెప్పారు!
By: Tupaki Desk | 13 April 2021 6:00 PM ISTనేరస్తుల నుంచి నిజం చెప్పించడం పోలీసుల అంతిమ లక్ష్యం. దానికోసం.. వారు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఎన్నో మార్గాలను ఆన్వేషిస్తారు. అయితే.. ఒక్కోసారి చిన్న లాజిక్ తో మ్యాజిక్ చేస్తారు. కేసు ఛేదిస్తారు. ఇది కూడా అలాంటిదే. అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
ఢిల్లీలో ఈ నెల 5వ తేదీన హత్య జరిగింది. పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి చూశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ.. ఎలాంటి ఆధారమూ లభించలేదు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినా.. క్లారిటీ లేదు. చనిపోయిన వ్యక్తి పేరు చంద్రభాను. హత్యకావడానికి ముందు వరకు అతను ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
ఇద్దరు స్నేహితులతో టచ్ లో ఉన్నట్టు తేలింది. వారిని విచారించారు. కానీ.. తమకు ఏ పాపం తెలియదని చెప్పారు. దీంతో.. కేసు మరింత జఠిలమైంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలేవీ తెలియట్లేదు. దీంతో.. సీసీ టీవీని మరోసారి ఆశ్రయించారు. హత్య జరిగే సమయానికి కాసేపటి ముందు ఓ ముగ్గురు వ్యక్తులు అటువైపుగా వెళ్తున్నారు. కానీ.. ఎవరన్నది క్లారిటీ రావట్లేదు. స్పష్టంగా కనిపించట్లేదు.
దీంతో.. ఇది వాళ్లపనే అని మళ్లీ ఆ ఇద్దరిని పిలిపించారు. ఖచ్చితంగా ఈ హత్య చేసింది మీరే అని అన్నారు. ‘అయ్యా.. మాకేం తెలియదు’ అంటూ పాత క్యాసెట్ రిపీట్ చేశారు. సీసీటీవీని చూపిస్తే.. అందులో ఉన్నది తాము కాదని చెప్పారు. మీరు బుకాయించొద్దు.. నిజం తేలిపోయింది అన్నారు పోలీసులు. అంత గట్టిగా ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించారు అనుమానితులు. ఆకాశంలో శాటిలైట్స్ ఉంటాయి తెలుసా..? అందులోంచి ఫొటో తెప్పించాం. అవి మీ ముఖాలేనని స్పష్టంగా తేలిపోయిందని చెప్పారు.
నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని అన్నారు. దీంతో.. వాళ్లిద్దరూ నిజం ఒప్పేసుకున్నారు. తామే హత్య చేశామని చెప్పేశారు. మరి, ఆ శాటిలైట్ ఫొటో ఏదీ అని అడిగితే.. ఫొటో లేదు.. ఏం లేదు. జస్ట్ చీకట్లో రాయివేశాం.. తగిలిందని చెప్పారు పోలీసులు.