Begin typing your search above and press return to search.

సీఐడీ సునీల్ పై చర్యలు తీసుకోవాలని హోంశాఖ లేఖ!

By:  Tupaki Desk   |   3 July 2021 3:30 PM GMT
సీఐడీ సునీల్ పై చర్యలు తీసుకోవాలని హోంశాఖ లేఖ!
X
ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని కేంద్రహోంశాఖ తాజాగా ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాసింది. ఏపీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సహా పలువురి ఫిర్యాదు మేరకు ఈ నివేదిక కోరింది.

సీఐడీ చీఫ్ హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్ అయ్యిండి ఓ సంస్థను పెట్టి ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు లీగల్ రైట్స్ అడ్వైజరీ అనే స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కేంద్రానికి తాజాగా ఫిర్యాదు చేశారు. వారు ఫిర్యాదులు చేసిన తర్వాత ఆ వీడియోలను సునీల్ కుమార్ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించారు.

అయితే అప్పటికే డౌన్ లోడ్ చేసి ఫిర్యాదు చేసి కేంద్రహోంశాఖకు అందించారు. ఈ ఫిర్యాదులపై హోంశాఖ స్పందించింది. ఎంపీ రఘురామతోపాటు లీగల్ రైట్స్ అడ్వైజరీ సంస్థ చేసిన ఫిర్యాదులను ఆధారాలను, ఏపీ సీఎస్ కు, కేంద్రహోంశాఖకు పంపింది. ఈ అంశం విషయంలో సునీల్ కుమార్ పై నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించడంతో సీఐడీ సునీల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు.

సీఐడీ సునీల్ ఏదో ఓ చర్య తీసుకోకతప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. సాధారణంగా సివిల్ సర్వీస్ అధికారులపై చర్యలు అంటే.. ముందుగా బదిలీ చేస్తారు. ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలోనూ ఏపీ సర్కార్ బదిలీ చేయకుండా ఉంచింది. ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో అధికారవర్గాల్లో ఈ చర్య చర్చనీయాంశంగా మారింది.

ఎంపీ రఘురామరాజు అరెస్ట్ విషయంలోనూ సీఐడీ చీఫ్ సునీల్ పై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఇప్పుడు సునీల్ కుమార్ ను ప్రభుత్వం తప్పిస్తుందా? లేకపోతే ఇంకేదైనా చర్య తీసుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఇక మొదటి నుంచి సీఐడీ సునీల్ కుమార్ కు మద్దతుగానే జగన్ సర్కార్ నిలబడుతోందన్న చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది.