Begin typing your search above and press return to search.

లోకేశ్ రేప్ చేసాడంటే? బాబు పది హత్యలు చేశారంటే ఊరుకుంటారా?

By:  Tupaki Desk   |   18 Aug 2020 12:15 PM IST
లోకేశ్ రేప్ చేసాడంటే? బాబు పది హత్యలు చేశారంటే ఊరుకుంటారా?
X
రాజకీయాల్లో ఇప్పుడు కొత్త పోకడ మొదలైంది. నిజానికి పదిహేనేళ్ల క్రితం మొదలై.. ఇప్పుడు ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిని ఏదైనా ప్రశ్న అడిగితే.. దానికి సూటిగా సమాధానం చెప్పటం లేదంటే.. ప్రజల్లో ఉన్న అనుమానాల్ని తీర్చేలా బదులివ్వటం మానేసి.. ఎదురుదాడి చేసినట్లుగా వ్యాఖ్యలు చేసే ధోరణి పెరిగింది. దీనికి తగ్గట్లే తాజాగా ఏపీ హోంమంత్రి మేకపాటి సుచరిత మాటలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యాయవ్యవస్థకు చెందిన ముఖ్యల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ ఒక మీడియా సంస్థలో వచ్చిన వార్త ఏపీ రాజకీయాల్ని వేడెక్కేలా చేసింది. ఈ కథనం పెను సంచలనంగా మారింది. ఈ అంశంపై అధికారపక్షం తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఏపీ హోంమంత్రి మేకపాటి అనూహ్య రీతిలో స్పందించారు.

ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారమన్న ఆమె.. అందుకు తగ్గ వివరణ ఇచ్చే విషయాన్ని వదిలేసి.. విపక్షంపై విరుచుకుపడిన తీరు ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ప్రభుత్వం మీద ట్యాపింగ్ ఆరోపణలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. లోకేశ్ మానభంగం చేశారని ఆరోపిస్తే ఊరుకుంటారా? చంద్రబాబు పది హత్యలు చేశారంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదరణ పెరగకుండా ఉండేందుకు ఈ తరహా కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబు నైజమన్న ఆమె.. ఫోన్ ట్యాపింగ్ అని పత్రికల్లో వార్త రాస్తారని.. దానికి చంద్రబాబు స్పందిస్తూ ప్రధానికి లేఖ రాస్తారని తప్పు పట్టారు. ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలకు సూటిగా సమాధానం చెప్పేస్తే సరిపోతుంది కదా? మధ్యలో ఈ మానభంగాలు.. హత్యలు అవసరమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.