Begin typing your search above and press return to search.

హిట్లర్ సూసైడ్ చేసుకోలేదట

By:  Tupaki Desk   |   27 Jan 2016 10:30 PM GMT
హిట్లర్ సూసైడ్ చేసుకోలేదట
X
సుభాష్ చంద్రబోస్ మరణంపై అనేక సందేహాలు - అనుమానాలు. ప్రభుత్వం ఎన్ని రహస్య పత్రాలను ప్రజలకు వెల్లడిస్తున్నా కూడా బోస్ మరణంపై ఉన్న అనుమానాలు ఇంకా తొలగలేదు. తాజాగా అదే కాలానికి చెందిన హిట్లర్ మరణంపైనా ఇప్పుడు కొత్తగా అనుమానాలు తలెత్తుతున్నాయి. కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. అత్యంత క్రూరుడైన నియంతగా పేరొందిన అడాల్ఫ్‌ హిట్లర్‌ అందరూ భావిస్తున్నట్లు తనను తాను కాల్చుకుని మరణించలేదని.. బ్రెజిల్‌ లోని ఒక చిన్న పట్టణంలో 95 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ తన ప్రేయసితో కలిసి జీవించాడని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

సిమోని రెనీ గ్యురేరో డియాస్‌ అనే రచయిత రాసిన 'హిట్లర్‌ ఇన్‌ బ్రెజిల్‌ - హిజ్‌ లైఫ్‌ అండ్‌ హిజ్‌ డెత్‌' అనే గ్రంథం ఆధారంగా ఒక వార్తాసంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. హిట్లర్‌ బ్రెజిల్‌ లోని పట్టణంలో నివసించడానికి ముందు అర్జెంటీనా మీదుగా పరాగ్వేకు వెళ్లాడని ఆ గ్రంథంలో పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. తన వాదానికి సాక్ష్యంగా తన ప్రేయసితో కలిసి ఉన్న హిట్లర్‌ ఫొటోను డియాస్‌ తన గ్రంథంలో ప్రచురించాడు. 1984లో హిట్లర్‌ మరణించడానికి రెండేళ్ల ముందు ఈ ఫొటోను తీశారు.

హిట్లర్‌ తన పేరును అడాల్ఫ్‌ లీప్జిగ్‌ అని చెప్పుకున్నారని, స్థానికులు అతడిని జర్మనీ వృద్ధుడిగా పిలిచేవారని ఆ నివేదిక తెలిపింది. లీప్జిగ్‌ అవశేషాలకు డిఎన్‌ ఎ పరీక్ష చేయాలని డియాస్‌ డిమాండ్‌ చేశారు. హిట్లర్‌ దక్షిణ అమెరికాకు పారిపోయాడని పలువురు ఎప్పటినుంచో పేర్కొంటున్నారు. అయితే బ్రెజిల్‌ కు చెందిన మేధావులు హిట్లర్‌ తమ దేశంలో నివసించి, అక్కడే మృతి చెందాడనే వార్తను కొట్టిపారేస్తున్నారు.