Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో హిట్ అండ్ ర‌న్‌.. నిందితుడి అరెస్టు!

By:  Tupaki Desk   |   26 Jun 2021 7:00 AM IST
హైద‌రాబాద్ లో హిట్ అండ్ ర‌న్‌.. నిందితుడి అరెస్టు!
X
ఖ‌రీదైన కారులో ఓవ‌ర్ స్పీడ్ లో దూసుకెళ్లి అన్యాయంగా పాద‌చారుల చావుకు కార‌ణ‌మైన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. హైద‌రాబాద్ లో బుధ‌వారం జ‌రిగిన ఈ దారుణానికి కార‌ణ‌మైన నిందితుడిని.. గురువారం అదుపులోకి తీసుకున్నారు.

హైద‌రాబాద్ లోని శాలిబండ ఏరియాలో బుధ‌వారం సాయ‌త్రం ఖ‌రీదైన మెర్సిడిజ్ బెంజ్ కారు.. అమిత‌మైన వేగంతో దూసుకొచ్చి రోడ్డుమీద న‌డిచివెళ్తున్న వాళ్ల‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ మృతిచెంద‌డంతోపాటు మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఘ‌ట‌నా స‌మ‌యంలో ఈ కారులోని వారంతా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నార‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపిన‌ట్టు స‌మాచారం. అయితే.. కారుతో ఢీకొట్టిన త‌ర్వాత అందులోని వారంతా పారిపోయారు. ఈ ప్ర‌మాద దృశ్యాలు, పారిపోవ‌డం వంటి ఘ‌ట‌న‌లు స‌మీపంలోని సీసీ కెమెరాలో స్ప‌ష్టంగా రికార్డ‌య్యాయి.

ఈ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్లో ఐపీసీ 304 ఏ, 337 సెక్ష‌న్ల‌ కింద కేసు నమోదైంది. కాగా.. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన మెర్సిడెస్ ఎస్‌యూవీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి అడ్ర‌స్ ట్రేస్ చేసిన పోలీసులు అక్క‌డికి వెళ్ల‌గా.. ఇంటికి తాళం వేసి ఉన్న‌ట్టు స‌మాచారం.

మొత్తానికి గురువారం సాయ‌త్రం నిందితుడిని అరెస్టు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. శుక్రవారం వాళ్ల‌ను మీడియా ముందు హాజ‌రుప‌రుస్తార‌ని స‌మాచారం.