Begin typing your search above and press return to search.

ఆ ఉయ్యాలవాడ రెడ్డిగారి గొప్పదనం.. బ్రిటీష్ రాణి మెచ్చి పతాకం ఇచ్చింది!

By:  Tupaki Desk   |   19 Oct 2019 3:53 AM GMT
ఆ ఉయ్యాలవాడ రెడ్డిగారి గొప్పదనం.. బ్రిటీష్ రాణి మెచ్చి పతాకం ఇచ్చింది!
X
ఇటీవలే 'సైరా నరసింహారెడ్డి' సినిమా రూపంలో ఒక ఉయ్యాలవాడ వీరుడి గురించి ప్రపంచానికి తెలిసిందే. శతాబ్దాల పాటు స్థానికంగానే పరిమితం అయిన ఆ వీరుడి కథ ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందే. ఇక అదే వూరికి చెందిన మరో మహనీయుడూ ఉన్నారు. ఆయన పేరే బుడ్డా వెంగళరెడ్డి.

అపరదాతగా ఆయనకు పేరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారితో పోరాడి పేరు తెచ్చుకుంటే, ప్రభుత్వంతో సఖ్యతగా మెలుగుతూనే ప్రజలకు సేవ చేశాడు అదే ఉయ్యాలవాడకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి. తన దాతృత్వంలో అప్పటి బ్రిటీష్ రాణి క్వీన్ విక్టోరియానే ఆకట్టుకున్న వ్యక్తి బుడ్డా వెంగళరెడ్డి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని 'రేనాడు సూర్యుడు' అని అంటారు. బుడ్డా వెంగళ రెడ్డిని 'రేనాటి చంద్రుడు' అంటారు. నరసింహారెడ్డి సూర్యుడి వంటి వ్యక్తి అయితే, వెంగళ రెడ్డి చంద్రుడి వంటి చల్లటి వ్యక్తి.

ఆయన దాతృత్వాన్ని మెచ్చి బ్రిటీష్ రాణి క్వీన్ విక్టోరియా ఇచ్చిన బంగారు పతాకం ఇప్పటికీ ఉయ్యాలవాడలోని వారి వారసుల వద్ద భద్రంగా ఉంది. ఆ అరుదైన, శతాబ్దాల కిందటి పతకానికి సంబంధించిన వీడియో ఇది. ఇప్పటికీ చెక్కుచెదరని ఆ గౌరవం గురించి ఈ వీడియోలో చూడవచ్చు.