Begin typing your search above and press return to search.

టపాసులకు ఓ చరిత్రుంది.. అది వేలయేళ్ల నాటిది

By:  Tupaki Desk   |   2 Nov 2020 5:00 AM IST
టపాసులకు ఓ చరిత్రుంది.. అది వేలయేళ్ల  నాటిది
X
దీపాలను ఒక వరసలో పేర్చడాన్నే దీపావళి అంటారు. అయితే దీపావళి పండగకు సంబంధించిన అనేక పురాణగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. టపాసులు ఎక్కడ పుట్టాయి. మన దీపావళితో ఈ టపాసులకు సంబంధం ఏమిటన్నదే ఇక్కడ ప్రశ్న. నిజానికి ఇప్పుడు మనం పేలుస్తున్న దీపావళి
టపాసులకు పుట్టినిళ్లు చైనా అని చెబుతున్నారు చరిత్రకారులు. లేదు హిందూ పురాణాల్లోనే వీటి ప్రస్తావన ఉన్నదని ఉదాహరణలతో చెప్పే సాంప్రదాయవాదులూ ఉన్నారు. దీపావళి పటాసులు ఎక్కడ పుట్టాయో తెలుసుకుందాం..

క్రీ.పూ. 200 సంవత్సరంలో చైనా వాళ్లు.. బొంగులతో ‘భోజు’ అనే ఫైర్ క్రాకర్ తయారు చేశారు. ఓ వెదురుబొంగులో మందును నింపి దాన్ని అంటిస్తే అది మంటలు విరజిమ్మేది. ఇప్పుడు చిచ్చుబుడ్డి లాంటిది. ఇది మొదటి టపాసు అని చరిత్ర కారుల అభిప్రాయం. అయితే చైనీయులు దీన్ని దయ్యాలు, భూతాలను పారదోలేందుకు ఉపయోగించేవారట.

9వ శతాబ్దం నాటికి బొంగు పేలుడునే చైనా వాళ్ళు అభివృధ్ధి పరిచి గన్ పౌడర్ ను కనుక్కున్నట్లు చరిత్రకారులు చెబుతారు.

1)కంపాస్. 2 ) గన్ పౌడర్, 3) పేపర్. 4). ప్రింటింగ్ అనేవి ద గ్రేట్ ఫోర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ చైనా అని పిలువబడుతున్నాయి.

ప్రారంభంలో సల్ఫర్ , చార్కోల్, పొటాషియం నైట్రేట్ ల మిశ్రమం ఈ గన్ పౌడర్. గంధకం, చార్కోల్ తో కలిసి మండిన వేడికి నైట్రైట్ కరిగి వాయు రూపం చెంది అధికంగా వ్యాకోచించి వాటిని చుట్టి ఉన్న గొట్టాన్ని పెద్ద ఫోర్స్ తో బద్దలు గొట్టుకొని పెద్ద శబ్దంతో బయటకు మిరుగులను విరజిమ్మెది. క్రీ శ14 వ శతాబ్దంలో అరబ్బులు, చైనా నుంచి ఈ మందు గుండు సామాగ్రిని ఇండియాకు, యూరప్ కు తీసుకొని వెళ్లినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.


అయితే క్రీ.శ.1497-1539 లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గజపతి ప్రతాపరుద్రదేవుడు రాసిన ‘కౌటుక చింతామణి’ అనే గ్రంథంలో టపాసుల ప్రస్తావన ఉన్నది. చైనాలో వాడే ముడిపదార్థాలు మనదేశంలో దొరకనందున దేశీయ పదార్థాలు వాడి టపాసులను తయారుచేసినట్టు ఈ పుస్తకంలో రాసి ఉంది. విజయనగర సామ్రాజ్యంలో పెళ్లిళ్లు, వేడుకల్లో టపాసులు కాల్చినట్టు ఆధారాలు ఉన్నాయి. ఓ వైపు టపాసులు కాల్చొద్దంటూ పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో స్పందించింది. అయినప్పటికీ ప్రతి ఏడాది దీపావళి పండగనాడు వేలకోట్ల విలువైన టపాసులు పేలుతూనే ఉన్నాయి. మెజార్టీ ప్రజలకు దీపావళి పెద్ద పండుగ. ఈ విషయంలో ప్రభుత్వాలు కలుగజేసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల ప్రభుత్వాలు పెద్దగా జోక్యం చేసుకోవు.